వైరల్: డాన్స్ మూమెంట్స్‌తో మరోసారి అదరగొట్టిన సమంత..!?
ఇక ఈ భామ రీసెంట్‌గా ‘ఆహా’ ఓటీటీ కోసం యాంకర్ అవతారం ఎత్తి తనదైన శైలిలో సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసి సామ్ జామ్ ప్రోగ్రామ్‌కు వన్నె తెచ్చింది. ఇక మరోవైపు సినిమాలతో పాటు ఓటీటీలో కూడా నటిస్తూ దూకుడు మీదుంది. త్వరలో సమంత నటించిన ‘ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. రెండో సీజన్ లో సమంత టెర్రరిస్ట్ గా నటిస్తుండడంతో ఈ సిరీస్ పై మరింత ఆసక్తి నెలకొంది. తాజాగా సమంత అక్కినేన అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఓ డాన్స్ మూమెంట్స్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కు దాదాపు 9 లక్షల మంది పైగా లైక్ చేసారు.
ఇక ప్రస్తుతం సమంత.. గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత అక్కినేని శకుంతలగా నటిస్తోంది. ఈ సినిమాలో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నాడని సమాచారం. కేరళలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు దేవ్ మోహన్. మొత్తంగా తెలుగు ప్రేక్షకులను అంతగా పరిచయం లేడు. అంటే శాకుంతలం సినిమాను మొత్తం సమంత తన భుజాలపై మోయాలనే చెప్పాలి. ఈ సంగతి పక్కన పెడితే.. మొత్తంగా సమంత అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా చేసిన డాన్స్ మూమెంట్స్ తో మరోసారి వార్తల్లో నిలిచింది.