దిల్ రాజు తెలివి చూస్తే షాక్ అవ్వాలసిందే.. ఏం చేశాడంటే..!?

Suma Kallamadi
తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లరి నరేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఒకప్పుడు కామెడీ హీరోగా హిట్ మీద హిట్ అందుకున్న హీరో. ఆతర్వాత వరుస ప్లాప్ లతో సతమతమవుతూ, క్యారెక్టర్ యాక్టర్ గా కూడా చేయడానికి సిద్ధపడ్డాడు. అయితే రోజులన్నీ ఒకేలా ఉండవని నిరూపిస్తూ అతడు. తాజాగా ‌హీరోగా నటించిన నాంది సినిమా ప్రేక్షక ఆదరణ అందుకుంటోంది.
ఈ సినిమాతో నరేష్ ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న సక్సెస్ ను ఈ సినిమాతో నరేష్‌ దక్కించుకున్నాడు. అయితే ఇక్కడే లాజిక్కు ఉంది. ఏ పని చేసినా అందులో లాభాన్ని అందుకునే దిల్ రాజు ఈ సినిమాను కేవలం మూడు కోట్ల రూపాయలకు నాలుగు భాషల రీమేక్‌ రైట్స్‌ ను దక్కించుకుని బాలీవుడ్‌ లో యంగ్‌ స్టార్‌ హీరోతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఇప్పటికే చర్చలు మొదలు పెట్టాడు.
అయితే నిజానికి ఒక సాధారణ డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుండి బడా ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిన దిల్‌ రాజు సినిమా వ్యాపారంలో ఆందెవేసిన చేయిగా మారిపోయాడు. ఇక తమిళం, కన్నడం మలయాళంలో కూడా ఈ సినిమా ను యంగ్ హీరోలతో రీమేక్ చేయాలని అక్కడి నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎంత లేదన్నా ఈ నాలుగు భాషల సినిమాల విలువ వంద కోట్లకు పైగానే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. చిన్న బడ్జెట్‌ సినిమా రీమేక్‌ రైట్స్ ను కొనుగోలు చేసి వంద కోట్ల బిజినెస్ చేస్తున్న దిల్‌ రాజు ముందు ఎవరూ ఆగలేరని టాక్ వినిపిస్తోంది.
కానీ.. అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాకు భాషతో సంబంధం లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ కాస్త తక్కువగా ఉన్నా కూడా మంచి సినిమా అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతేకాదు, అన్ని భాషల్లో కూడా సక్సెస్‌ అయ్యే యూనివర్శిల్ కాన్సెప్ట్‌ తో నాంది సినిమా నిర్మించారు. అందుకే నాలుగు భాషల్లో రీమేక్‌ చేసేందుకు దిల్‌ రాజు సిద్దం అయ్యాడు. ఎలాంటి సినిమాలు తీసుకోవాలి, ఎలాంటి కథలు ఎంపిక చేసుకోవాలో ప్రస్తుతం ఇండస్ట్రీలో దిల్ రాజుని చూసి నేర్చుకుని తీరాలని పలువురు ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: