రాజమౌళి పై పట్టు బిగించిన జూనియర్ చరణ్ లు ?

Seetha Sailaja

‘బాహుబలి’ మూవీ కోసం ప్రభాస్ తన సినిమాలను 4 సంవత్సరాలు వదులు కోవడమే కాకుండా ఆమూవీ షూటింగ్ పూర్తి అయ్యే వరకు ప్రభాస్ బయట ఫంక్షన్స్ లో కూడ కనిపించే వాడు కాదు. దీనితో ప్రభాస్ రాజమౌళి బంధి ఖానా లో పూర్తిగా చిక్కుకున్నాడు అంటూ అప్పట్లో మీడియాలో జోక్స్ కూడ వస్తూ ఉండేవి.

‘బాహుబలి’ తరువాత ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని రాజమౌళి చరణ్ జూనియర్ లతో తీస్తున్న పరిస్థితులలో వీరిద్దరూ కూడ ప్రభాస్ లాగే జక్కన్న వద్ద బందీ లుగా మారిపోతారు అని చాలామంది ఊహించారు కానీ జరిగింది వేరు. ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే చరణ్ నెమ్మదిగా రాజమౌళిని ఒప్పించి ఇప్పుడు ‘ఆచార్య’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

చరణ్ మళ్ళీ ‘ఆర్ ఆర్ ఆర్’ షూట్ వైపు రావాలి అంటే మరొక నెల రోజులు పట్టే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు జూనియర్ కూడ చరణ్ తీరును ఆసరిస్తూ తాను ఒక ప్రముఖ ఛానల్ లో హోస్ట్ చేయబోతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో షూటింగ్ క్ సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ షో షూటింగ్ మార్చి మొదటి వారం నుండి ప్రారంభం అని అంటున్నారు. దీనితో వచ్చే నెలలో చాలారోజులు చరణ్ జూనియర్ లు లేకుండానే ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను మిగతా నటీనటుల సహకారంతో కొనసాగించ వలసిన పరిస్థితి.

ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి వార్తలు లీక్ అవ్వడంతో హీరోల పై తన పట్టును కొనసాగించడంలో రాజమౌళి తన పట్టు కోల్పోయాడా అంటూ ఇండస్ట్రీలో కొందరు కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. అయితే జక్కన్న ఎప్పుడు తన పట్టు కోల్పోడనీ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు సంబంధించి చరణ్ జూనియర్ లపై తీయవలసిన సీన్స్ చాల తక్కువగా ఉండటంతో చరణ్ జుఇయర్ లకు ఇలా కాలం కలిసి వచ్చింది అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: