షాకింగ్.. అచ్చం ఐశ్వర్యాలాగానే ఉంది.. ఈ అమ్మడు ఎవరో తెలుసా..?
ఇలాంటి పోలికల విషయానికి వస్తే.. మనం తరచూ వినే మాట.. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అనేది. ఏడుగురి సంగతి ఏమో కానీ.. మన భారత సుందరి ఐశ్వర్యరాయ్ ను పోలిన ఓ వ్యక్తి ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. పాకిస్థాన్‌కు చెందిన ఆమ్నా ఇమ్రాన్. ఈమె అచ్చంగా మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్లా కనిపిస్తోంది కదా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఏ విషయం అయినా వేగంగా తెలిసిపోతోంది.
ఆమ్నా ఇమ్రాన్ విషయం కూడా అలాగే సోషల్ మీడియా ద్వారానే వ్యాపించింది. ఈ అమ్మడు.. 2017నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. అవి చూసిన కొందరు అచ్చు ఐశ్వర్యారాయ్లాగానే ఉందని గుర్తు పట్టారు. అలా ఈ పాక్ అమ్మాయి క్రమంగా పాపులర్ అవుతోంది. ఆమ్నా షేర్ చేసిన ఫొటోలు చూసిన పలువురు నెటిజన్లు.. అచ్చంగా ఐశ్వర్యరాయ్‌లా ఉన్నావంటూ ఆమెను తెగపొగిడేస్తున్నారు.
మొదట్లోఈ ఐశ్వర్యారాయ్ గురించి తెలుసుకున్న ఆమ్నా ఇమ్రాన్.. ఆ తర్వాత.. ఆ విషయాన్ని తన పాపులారిటీ కోసం కూడా వాడుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం ఆమె ఐశ్వర్యలా కనిపించేందుకు సర్జరీలు చేయించుకుందని విమర్శస్తుంటారు. కానీ ఆమ్నా ఇమ్రాన్ మాత్రం తాను ఇప్పటి వరకూ అలాంటి పనులేమీ చేయలేదని చెబుతున్నారు. ఐశ్వర్యలా కనిపించడం తన అదృష్టమంటున్న ఆమ్నా ఇమ్రాన్... ఇప్పుడు ఐశ్వర్య లుక్స్‌ను రీక్రియేట్ చేస్తూ బిజీబిజీగా ఉంటోందట.