మద్యం మత్తులో మూడు వాహనాలు ఢీకొట్టిన యూట్యూబ్ స్టార్..!?

N.ANJI
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ గురించి తెలియని వారంటూ ఉండరు.ముఖ్యంగా యూట్యూబ్‌ను రెగ్యులర్ చూస్తుంటే షణ్ముఖ్ ఎవరు తెలుస్తుంది. ఇతనో సోషల్ మీడియా స్టార్. షణ్ముక్ జస్వంత్ యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్, డాన్స్ వీడియోలతో చాలా ఫేమస్ అయ్యాడు. ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా తీస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన సాప్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందింది.
అది అలా ఉంటే షణ్ముక్ జస్వంత్ మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో మూడు కార్లు రెండు ద్విచక్ర వాహనాలను షణ్ముఖ్ కారు ఢీ కొట్టింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నటుడు షణ్ముఖ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో షణ్ముఖ్‌ మోతాదుకి మించి మద్యం సేవించాడని తెలుస్తోంది. బ్రీత్ అనలైజర్ టెస్టులో 170 పాయింట్లుగా తేలడంతో కారు సీజ్ చేశామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఇక షణ్ముఖ్ వైవా అనే షార్ట్ ఫిల్మ్‌తో పాపులర్ అయ్యాడు. ఆ షార్ట్ ఫిల్మ్‌తో ఓ నటుడుగా మారిన షణ్ముఖ్ తెలుగు హిట్ సాంగ్స్‌కు డాన్స్ కవర్స్ చేస్తూ చాలా ఫేమస్ అయ్యాడు. షణ్ముఖ్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అంతేకాదు షణ్ముఖ్‌‌కు యూట్యూబ్‌లో దాదాపు మూడు కోట్ల మంది, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కోటి 20 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. షణ్ముఖ్‌ ప్రస్తుతం సూర్య అనే మరో వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక షణ్ముఖ్ గతంలో బిగ్ బాస్ ఫేమ్ దీప్తీ సునైనాతో పలు డాన్స్ వీడియోలు చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: