ఆ హీరోయిన్ ను పని పిల్లలా ఉందన్నారు.. కట్ చేస్తే 7 శతదినోత్సవ చిత్రాలు చేసిన హీరో ఎవరో తెలుసా..?
పని పిల్లలా ఉన్న ఆ హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్నారా..? ఆమె ఎవరో కాదు..సూపర్ స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాధిక చెల్లెలు నిరోషా.. నిరోషా "న్యాయం కావాలి" అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది.. ఆ తర్వాత ఈమె బాలకృష్ణ తో నారీ నారీ నడుమ మురారి, చిరంజీవితో స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ లాంటి చిత్రాలలో నటించి, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అంతే కాకుండా తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ గా అనువదించబడిన ఘర్షణ చిత్రంలో కూడా నిరోషా నటించింది.
అంతేకాకుండా 1980వ సంవత్సరంలో దూరదర్శన్ ఛానల్ లో చిత్రలహరి లో ప్రసారమయ్యే "బృందావనం సోయగం " అనే సిమ్మింగ్ ఫూల్ పాటని గుర్తు చేసుకుంటే చాలు నిరోషా ఎవరో గుర్తుకు వస్తుంది.. అంతేకాకుండా 1988లో ప్రముఖ తమిళ దర్శకుడు అయిన దేవరాజ్.. తన దర్శకత్వంలో వచ్చిన "సింధూరపూవే" అనే తమిళ చిత్రాన్ని 1989లో తెలుగులోకి సింధూరపువ్వు గా అనువదించారు..
ఈ సినిమా మన తెలుగు ప్రజలను బాగా ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ చిత్రంలో వచ్చే" సింధూర పువ్వా.. నీవే చిందించరావా.. " అనే ఈ పాటకు ప్రేక్షకులు ఎంతగానో మంత్రముగ్ధులు అయ్యారు.. అయితే ఈ సినిమాలో ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ ని ఎంపిక చేసుకొనేటప్పుడు అందులో భాగంగానే రాధిక చెల్లెలు నిరోషా ని, దర్శకుడు దేవరాజ్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఫోటోలోని నిరోషా ను హీరో రాంకీ చూసినప్పుడు ఎవరీ అమ్మాయి పని పిల్లలా ఉంది అని అన్నాడు..
చివరికి ఆ అమ్మాయినే తమిళంలో సింధూరపూవే సినిమాలో సెలెక్ట్ చేయడం జరిగింది. అలా రాంకీ, నిరోషా లు కలిసి నటించిన ఈ చిత్రం తెలుగులో బ్లాక్ బాస్టర్ ని అందుకుంది . ఆ తరువాత వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలు నటించారు. ఒకరికొకరు బాగా అర్థం చేసుకొని చివరకు పెళ్లి కూడా చేసుకున్నారు.