అఖిల్ కోసం పూజా హగ్దే అందాల విందు..!
బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ టైటిల్ తోనే క్రేజ్ తెచ్చాడు భాస్కర్. గ్రాండ్ గా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసారు కానీ మధ్య లో కరోనా రావడం.. షూటింగ్ కు బ్రేక్ పడడం.. ఆ తర్వాత మళ్లీ స్టార్ట్ చేయడం.. కొన్ని సీన్లు రీషూట్ చేయడం ఇలా చేస్తూ వస్తున్నారు. కానీ సినిమా అవుట్ ఫుట్ మాత్రం వారు అనుకున్నంత రావడం లేదట. మరోపక్క ఇప్పటివరకు విడుదలైన టీజర్స్ ,సాంగ్స్ సైతం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో మేకర్స్ ఎలాగైనా సినిమాకు క్రేజ్ తీసుకరావాలని ఫిక్స్ అయ్యారు.
అఖిల్ ను నమ్ముకుంటే వర్క్ అవుట్ కాదని గోల్డెన్ లెగ్ హీరోయిన్ పూజా ను రంగంలోకి దింపాలని అనుకుంటున్నారట. అందుకోసం పూజా హగ్దే చేత బికినీ వేయించి.. ఆ పిక్స్ ను ప్రచారంలోకి వదలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం పూజా కు విపరీతమైన క్రేజ్ ఉండడం తో ఆ క్రేజ్ కు కాస్త మసాలా జోడిస్తే బ్యాచిలర్ కు అసలైన బజ్ వస్తుందని నమ్ముతున్నారట. మొత్తం మీద అఖిల్ కోసం పూజా బికినీ కి సిద్ధమైంది.