మళ్ళీ వొణికి పోతున్న టాలీవుడ్ !
ఇలాంటి పరిస్థితులలో తిరిగి మహారాష్ట్ర కేరళ రాష్ట్రాలను కరోనా కేసులు మళ్ళీ పెరిగిపోతు ఉండటంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడ మళ్ళీ కరోనా కేసులు పెరిగే ఆస్కారం ఉంది అని వస్తున్న హెచ్చరికలు ఇండస్ట్రీ వర్గాలను బెంబేలు పెడుతున్నాయి. ఇప్పుడిప్పుడే గత సంవత్సరం కరోనా పరిస్థితులు వల్ల ఏర్పడ్డ భారీ నష్టాల నుండి ఇండస్ట్రీ కోలుకుంటోంది.
దీనికితోడు అన్ని వర్గాల ప్రేక్షకులు ముంఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు కూడ కరోనా భయాలను పక్కకుపెట్టి ధియేటర్స్ కు వస్తున్నారు. దీనితో ధియేటర్స్ అన్నీ ప్రేక్షకులతో కళకళ లాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మహారాష్ట్రాలో ముంబాయిలో పెరుగుతున్న కరోనా కేసులు మరింత తీవ్ర రూపం దాల్చి పరిస్థితులు చేయి దాటిపోతే దాని ప్రభావం తప్పకుండ తెలుగు రాష్ట్రాల పై ఉంటుందని మళ్ళీ కరోనా భయాలు ఏర్పడితే ధియేటర్లకు ధైర్యంగా జనం రారు అంటూ టాప్ హీరోల సినిమాల బయ్యర్లలో భయాలు మొదలైనట్లు టాక్.
ఈ పరిస్థితులలో సమ్మర్ రేస్ కు విడుదల కాబోతున్న టాప్ హీరోల సినిమాలకు సంబంధించి బయ్యర్లు తాము ఒప్పుకున్న రెట్ల విషయంలో మళ్ళీ బేరసారాలు మొదలు పెడితే నిర్మాతలకు తల నొప్పులు మొదలై మళ్ళీ సినిమాల విడుదల తేదీలలో మార్పులు వచ్చే అవకాశం ఉంది అంటూ మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇండస్ట్రీ మరో కష్టాన్ని తట్టుకునే స్థితిలో లేదని ఇండస్ట్రీ వర్గాలు భయపడి పోతున్నాయి. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు విడుదల అయ్యే టాప్ హీరోల సినిమాల డేట్స్ అన్ని ముందుగా ఫిక్స్ కావడంతో మళ్ళీ అనుకోని పరిస్థితులు ఏర్పడితే సినిమాల రిలీజ్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ తలెత్తే అవకాశం ఉంది అని అంటున్నారు..