బాలయ్య రూట్లోనే మంచు విష్ణు కూడా..సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..??

Anilkumar
టాలీవుడ్ సీనియర్ మోస్ట్ హీరో నందమూరి బాలకృష్ణ, మంచు విష్ణు.. ఈ ఇద్దరు హీరోలకు మంచి హిట్ పడి చాలా కాలమే అయ్యింది..అయితే ఇప్పుడు వీళ్లిద్దరు హీరోలు హిట్ కోసం ఒకే రూట్లోకి వెళ్తున్నారు.. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నటసింహ నందమూరి బాలకృష్ణ, టాలెంటెడ్ హీరో మంచు విష్ణుకి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఈ క్యాలెండర్ ఇయర్ లో వీరి నుంచి రానున్న తొలి సినిమాలు.. ప్రత్యేక సందర్భాల్లోనే థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. ఇంకా చెప్పాలంటే.. బాలయ్య, మంచు విష్ణు సేమ్ రూట్ లో వెళుతున్నారనే చెప్పాలి.ఆ వివరాల్లోకి వెళితే..
తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బాలయ్య ఓ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. `సింహా`, `లెజెండ్` తరహాలో ఇందులోనూ బాలయ్యని రెండు విభిన్న పాత్రల్లో చూపబోతున్నారు బోయపాటి..ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కథానాయికలుగా నటిస్తున్నారు.. ఇక ఈ సినిమాకి డేంజర్, మోనార్క్, గాడ్ ఫాదర్ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.. ఇంకా టైటిల్ ఖరారు కాని  ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని యన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తండ్రి పుట్టినరోజున బాలయ్య కథానాయకుడిగా నటించిన సినిమా రానుండడం విశేషమనే చెప్పాలి.కట్ చేస్తే.. బాలయ్య కంటే ముందు మంచు విష్ణు కూడా తండ్రి పుట్టినరోజున కొత్త చిత్రంతో పలకరించబోతున్నాడు. `మోసగాళ్ళు` పేరుతో రూపొందిన ఈ మల్టీలింగ్వల్ మూవీ.. మోహన్ బాబు బర్త్ డే స్పెషల్ గా మార్చి 19న రిలీజ్ కానుందని టాక్.మరి.. సేమ్ రూట్ లో వెళుతున్న బాలయ్య, విష్ణుకి లక్ కలిసొచ్చి తమ కొత్త చిత్రాలతో హిట్స్ దక్కుతాయేమో చూడాలి.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: