నరేష్ ఫ్లాపుల్లో ఉన్నాడు అతనితో ఎందుకని అన్నారు..!

shami
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల డైరక్షన్ లో వచ్చిన సినిమా నాంది. ఫ్రై డే రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే సినిమాలో నరేష్ నటన గురించి మాత్రం బాగా మాట్లాడుతున్నారు. ఆరోజు రిలీజైన అన్ని సినిమాల కన్నా నరేష్ నాంది సినిమా గురించి మీడియాలో ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ ఆదివారం జరిగింది. ఈ సక్సెస్ మీట్ లో నరేష్ తనకు జరిగిన కొన్ని అనుభవాలను చెప్పాడు.
నరేష్ నాంది సినిమా చేస్తున్న టైం లో డైరక్టర్, నిర్మాతలను అతను ఫ్లాపుల్లో ఉన్నాడు అతనితో రిస్క్ ఎందుకని అన్నారట. అది మైండ్ లో పెట్టుకున్నానని.. తప్పకుండా ఈ సినిమా నుండి తానేంటో ప్రూవ్ చేస్తానని అంటున్నాడు అల్లరి నరేష్. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేద ప్రేక్షకులకు నచ్చిన సినిమా పెద్ద సినిమా అని నరేష్ అన్నారు. తనని నమ్మి ఈ కథ తన దగ్గరకు తెచ్చిన డైరక్టర్ విజయ్ కు తనని నమ్మి డబ్బులు పెట్టిన నిర్మాత సతీష్ కు ధన్యవాదాలు తెలిపాడు అల్లరి నరేష్.
ఈ సినిమాలో వరలక్ష్మి పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా నచ్చిందని.. సినిమాలో దేవి ప్రసాద్ బాగా చేశారని.. మిగతా పాత్రలు కూడా ప్రేక్షకులను మెప్పించాయని అన్నారు నరేష్. ఇక కామెడీ సినిమాలతో పాటు డిఫరెంట్ సినిమాలు కూడా చేస్తానని చెప్పారు. నాంది సినిమా నరేష్ కు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు. తప్పకుండా నరేష్ కు ఈ నాంది తర్వాత కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉండాలని ఆశిద్దాం.                                    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: