Rc15 సినిమా ఆ కథ అయితే సినిమా ఒక రేంజ్ లో ఉండటం ఖాయమట...???
దీనికి కారణం కూడా శంకరే. గతంలో ఆయన చెప్పిన మాటే.ఇక ఇప్పుడు చరణ్ తో అలాంటి కథ చేయబోతున్నాడో అని అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు.శంకర్ - రామ్‌చరణ్' సినిమా ఓపెనింగ్ ఘనంగా చేయాలని దిల్ రాజు నిర్ణయించుకున్నారట. తన బ్యానర్లో 50వ సినిమా కావడంతో దిల్ రాజు ఈ సినిమా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే భారీ కాంబినేషన్ కుదిర్చారు. కథ విషయంలో శంకర్ ఆలోచనలు భారీగా ఉంటాయి. డబ్బులు కూడా భారీగానే ఖర్చవుతాయి. 'ఇండియన్ 2' మొదలైన తర్వాత ఓ సందర్భంలో శంకర్ చెప్పిన మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తర్వాతి సినిమా సైన్స్‌ఫిక్షన్ తరహాలో ఉండబోతోందని శంకర్ ఆ రోజు చెప్పుకొచ్చాడు.అయితే ఇప్పుడు ఆ మాటను, రామ్‌చరణ్‌ను సినిమాను ముడిపెట్టి అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు.
శంకర్ అప్పుడు చెప్పినట్లుగా చరణ్‌తో సైన్స్‌ఫిక్షన్ మూవీ చేస్తాడు అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంలో దిల్ రాజు కాంపౌండ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. శంకర్ ఎలాగూ చెప్పరు, చరణ్ మాట్లాడరు.కాబట్టి శంకర్ సినిమా ఏ తరహాలో ఉంటుందో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...