వీళ్లిద్దరి మధ్య అది నిజమేనా..?
మహేశ్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్.. హృతిక్ రోషన్ ఇండియన్ గ్రీక్ గాడ్. ఇద్దరికీ ఫీమేల్ ఆడియన్స్‌లో బోల్డంత ఫాలోయింగ్ ఉంది. క్లాస్‌కి క్లాస్.. మాస్‌కి మాస్‌లా కనిపించే ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించబోతున్నారనే వార్త ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రామాయణగాథలో మహేశ్, హృతిక్ కలిసి నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.
మధు మంతెన, అల్లు అరవింద్, నమిత్ మల్హోత్ర సంయుక్త నిర్మాణంలో రామాయణ గాథ తెరకెక్కబోతోంది. త్రీడీ ఫార్మాట్‌లో 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేశ్ బాబు, హృతిక్ రోషన్ కలిసి నటిస్తారట. మహేశ్ బాబు రాముడి పాత్ర పోషిస్తే, హృతిక్ రోషన్ రావణాసురుడిగా కనిపిస్తాడని చెబుతున్నారు.
రామాయణం త్రీడీ అనౌన్స్‌మెంట్ వచ్చాక హృతిక్ రోషన్‌ని రాముడి పాత్రకి సెలక్ట్ చేశారని, దీపిక పదుకొణేని సీత పాత్రకి తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మధు మంతెన రాముడి పాత్ర కోసం మహేశ్ బాబుని కాంటాక్ట్ చేశాడట. హృతిక్‌కి రావణాసురుడి పాత్ర ఇచ్చి, మహేశ్‌ని రాముడిలా చూపించాలనుకుంటున్నాడట. అయితే మహేశ్ ఇంకా ఈప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.
మహేశ్ బాబు ఇప్పటివరకు బాలీవుడ్‌కి వెళ్లలేదు. మహేశ్‌కి తెలుగు, తమిళ ఇండస్ట్రీస్‌లోనే మార్కెట్ ఉంది. అయితే ఈ రామాయణం సినిమాతో మహేశ్ బాలీవుడ్‌కి వెళ్తే, ఫస్ట్ మూవీతోనే నార్త్‌లో మంచి గుర్తింపు వచ్చే అవకాశముంది. పైగా హృతిక్ రోషన్, దీపిక పదుకొణే లాంటి స్టార్స్ ఉన్నారు కాబట్టి, మహేశ్‌కి వైడ్ రేంజ్‌లో ఆడియన్స్‌ని పలకరించే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లో మహేశ్ పార్టనర్ అవుతాడా లేదా అనేది చూడాలి.