జబర్ధస్త్ ఆటో రాంప్రసాద్‌కు బిగ్ షాక్.. అభిమానులకు రిక్వెస్ట్..!?

N.ANJI
బుల్లితెరపై ప్రేక్షకులను గత కొన్ని సంవత్సరాలుగా కడుపుబ్బా నవ్విస్తున్న షో జబర్ధస్త్‌. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్ లు బుల్లితెరకు పరిచయమైయ్యారు. జబర్ధస్త్‌లో కొందరు స్టార్స్ చాలా పాపులర్. అలాంటి వారిలో రాంప్రసాద్ ఒకరు. ఆటో రాంప్రసాద్‌ గా జబర్ధస్త్ ఫ్యాన్స్ ‌ను ఎంటర్ టైన్ చేసే రాంప్రసాద్ పంచ్‌లను లైక్ చేసే వారి సంఖ్య బాగా ఎక్కువనే చెప్పాలి. అందుకే సోషల్ మీడియాలో రాంప్రసాద్‌ కు ఫాలోయింగ్ కూడా బాగానే ఉంటుంది.
అయితే తాజాగా రాంప్రసాద్‌కు ఊహించని షాక్ తగిలింది. రాంప్రసాద్ ఫేస్ బుక్ పేజీని ఎవరో హ్యాక్ చేశారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించింది. అయితే రీసెంట్ ‌గా తన ఫేస్ బుక్ పేజీని ఎవరో హ్యాక్ చేశారని.. కాబట్టి తన పేజ్ నుంచి వచ్చే వాటిని ఎవరూ పట్టించుకోవద్దని ఫ్యాన్స్‌ కు, ఫాలోవర్లకు సూచించాడు. తన పేజ్ నుంచి చాలామంది మేసేజ్‌లు వెళుతున్నాయన్నారు. అంతేకాక ఫోన్ నంబర్లు, ఫోటోలు పెట్టాలని అడుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని రాంప్రసాద్ తెలిపాడు.
అయితే తన ఫాలోవర్లు ఎవరూ వీటిని పట్టించుకోవద్దని కోరాడు. కేవలం తన పేజీని ఫాలో కావడంతో పాటు పిక్స్‌కు లైక్ మాత్రమే కొట్టాలని రిక్వెస్ట్ చేశాడు. తాను గతంలోనే ఇందుకు సంబంధించి ఓ సారి ఫాలోవర్లకు రిక్వెస్ట్ చేశానని.. మరోసారి ఇదే విషయాన్ని చెబుతున్నానని ఆటో రాంప్రసాద్ కోరాడు. ఇక జబర్ధస్త్‌లో సుడిగాలి సుధీర్ టీమ్ సభ్యుడిగా కొనసాగుతున్న ఆటో రాంప్రసాద్‌కు ఫాలోయింగ్ బాగానే ఉందని చెప్పాలి మరి. టీమ్ లీడర్ కాకపోయినా.. అదే స్థాయి రేంజ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆటో రాంప్రసాద్.. ఎప్పటికప్పుడు తనదైన పంచ్‌లతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే తాజాగా ఆయన ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయ్యిందని చెప్పడం ఆయన ఫ్యాన్స్, ఫాలోవర్లకు షాక్ ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: