ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. పలు తెలుగు సినిమాలలో బాల నటుడిగా మెప్పించి ఆకట్టుకున్నాడు తేజా సజ్జా.. తరువాత గ్యాప్ తీసుకోని సమంత ప్రధాన పాత్రలో వచ్చిన "ఓ బేబీ"సినిమాలో నటుడిగా నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మెయిన్ హీరోగా నటిస్తూ "జంబీ రెడ్డి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తేజా. ఈ సినిమాని "అ!","కల్కి" ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాని యాపిల్ ట్రీస్ స్టూడియోస్’ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మించాడు.తేజ సజ్జ, ఆనంది ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదలయ్యింది. విడుదలైన ప్రతి చోట మంచి టాక్ ని సంపాదించుకుంది. మొదటి షో నుండే ఈ చిత్రానికి మంచి డీసెంట్ హిట్ టాక్ రావడంతో…. మంచి ఓపెనింగ్స్ నే సాధించింది. ముఖ్యంగా మొదటి రోజు కంటే కూడా మూడవ రోజున ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం.. సోమవారం రోజున కూడా అదే జోరుని చూపించింది.మంచి వసూళ్ళని రాబట్టింది.సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.
ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే..‘జాంబీ రెడ్డి’ సినిమాకి 4.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవడానికి 5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 4.74 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 0.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి సోమవారం ఈ చిత్రం 0.89కోట్ల షేర్ ను రాబట్టి బాగానే క్యాష్ చేసుకుంది .
మరి వీక్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో ఎంత మేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...
మరింత సమాచారం తెలుసుకోండి: