రాశీ ఖన్నా: నిన్ను ఇష్టపడినట్లు నేనెవరినీ ఇష్టపడలేదు తెలుసా...?

VAMSI
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు రాశి ఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో వరుస ఫ్లాపులతో కాస్త సమస్యలు ఎదుర్కొన్నా ఆ తర్వాత వెంకీమామ, ప్రతిరోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్.. చిత్రాలతో తిరిగి వేగాన్ని పుంజుకుంది. అయితే ఈ అందాల భామ... ఒకరి గురించి తెగ పొగిడేస్తోంది. "నిన్ను ఇష్టపడ్డట్లుగా ఇంకెవరిని ఇష్టపడలేనేమో..." అంటూ తనపై  ప్రేమ కురిపించేస్తోంది. అందులోనూ లవ్ యు సో మచ్ అంటూ రాశి కామెంట్ పెట్టడం సంచలనంగా మారింది.
ఇంతకీ ఈ సొట్ట బుగ్గల బ్యూటీ లవ్ యు చెప్పింది ఎవరికీ అనుకుంటున్నారా..?? అది మరెవరికో కాదు తన సొంత మేనల్లుడికే. తన అన్న కుమారుడు నీల్ ఖన్నా పై ఎంతో ఇష్టం పెంచుకున్న రాశి ఖన్నా... ఈ రకంగా తన ప్రేమను తెలియజేశారు అన్న మాట. నిన్న చిట్టి బాబు నీల్ ఖన్నా పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తూ..నిన్ను ఇష్ట‌ప‌డ్డ‌ట్లుగా నా  లైఫ్ లో మ‌రెవ‌రినీ ఇష్ట‌ప‌డలేనేమో.. ఐ ల‌వ్ యు సో మ‌చ్ ఖన్నా ...అని కామెంట్ పెట్టారు. దీంతో రాశి కన్నా మేనల్లుడు కూడా ఫుల్ ఫేమస్ అయిపోయాడు.
ప్రస్తుతం రాశి ఖన్నా తన మేనల్లుడు తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ జోష్ తో హల్ చల్ చేస్తున్నాయి. రాశి ఖన్నాకు తన అల్లుడంటే ఎంతో ప్రేమంటే...తన బిజీ లైఫ్ లో కాస్త సమయం దొరికినా  మేనల్లుడు ఆటపాటలతో సమయం గడిపేస్తుంది. ఈ మధ్య తన 30 వ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా.. తను ప్రస్తుతం సింగల్ గా ఉన్నానని...నిజం చెప్పాలంటే ఎవరితో నైనా డేటింగ్‌ చేయాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అవకాశాలు తక్కువగానే ఉన్నా త్వరలోనే బిజీ గా మారుతానని ధీమాతో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: