ప్రభాస్ లవర్ బాయ్ గా ఈసారి మెప్పిస్తాడా?

Purushottham Vinay

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ "బాహుబలి" సినిమాతో పెద్ద పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తరువాత "సాహో" సినిమాతో కూడా బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించాడు. ఇక ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఇక "రాధే శ్యామ్" సినిమాతో లవర్ బాయ్ గా ఫ్యాన్స్ ని ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు.గతంలో కూడా లవర్ బాయ్ గా ప్రభాస్ ఆకట్టుకున్నాడు. "వర్షం", "డార్లింగ్" సినిమాలు అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కే కాదు. సాధారణ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక రాధే శ్యామ్ విషయానికి వస్తే ప్రభాస్ సరసన హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇక ఈ లవ్ స్టోరీ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ‘రాధేశ్యామ్’ ప్రీ టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ముందుగా ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ ను, ‘సాహో’ సినిమాలో ప్రభాస్ ను గంభీరంగా చూపిస్తూ.. ఇప్పుడు ఆయన హృదయాన్ని తెలుసుకునే సమయం వచ్చిందని.. ప్రేమికుల దినోత్సవం రోజున నిజమైన ప్రేమను చూస్తారంటూ ముప్పై సెకన్ల వీడియోను విడుదల చేశారు.ఇందులో ప్రభాస్ ఓ ప్రేమికుడిగా యంగ్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాడు.

దీన్ని బట్టి చూస్తుంటే ప్రభాస్ ఖచ్చితంగా మళ్ళీ లవర్ బాయ్ గా ఆకట్టుకుంటాడని అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా కృష్ణంరాజు సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: