రామ్ చరణ్ తనకు ఇష్టమైన ఆ పాత్ర వస్తే..కథ వినకుండానే ఓకే చెప్తాడట..!

Divya

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కొక్క హీరో, ఒక్కొక్క పాత్రను  ఇష్టపడుతుంటారు. ఇక అదే విధంగా హీరోలకు ఇష్టమైన పాత్ర వస్తే మాత్రం కథ వినకుండానే ఓకే చెప్తూ ఉంటారు కొంత మంది స్టార్ హీరోలు. ఇక అదే త్రోవలోనే  హీరో రామ్ చరణ్ కూడా నడవబోతున్నాడు. రామ్ చరణ్ కు ఆ పాత్ర అంటే చాలా ఇష్టమట..ఆ పాత్ర కోసం ఎవరైనా వచ్చి, నువ్వు ఈ పాత్రలో నటించాలి అని అనగానే చాలు కథ ఏమిటో వినకుండానే ఓకే చెప్తాడట. ఇంతకూ  ఆ పాత్ర ఏమిటి? అంతగా రాంచరణ్ ఆ పాత్రపై మొగ్గు  చూపడానికి గల కారణాలు ఏమిటో? ఇప్పుడు తెలుసుకుందాం..

మంగళవారం ఫిబ్రవరి 2 2021 సైబరాబాద్ లోని, గచ్చిబౌలిలో సైబరాబాద్ పోలీసులుఏర్పాటుచేసిన స్పోర్ట్స్ మీట్ ముగింపునకు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ పాల్గొన్నాడు. ఇక ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ" సైబరాబాద్ పోలీసులు ఏర్పాటుచేసిన స్పోర్ట్స్ మీట్ లో టగ్ ఆఫ్ వార్ ఫ్రెండ్లీ మ్యాచ్ లో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉంది. మార్చ్ ఫాస్ట్ చూస్తుంటే, నాకు స్కూల్ రోజులు గుర్తుకు వచ్చాయి. అంతేకాకుండా నేను కూడా స్కూలింగ్ సమయంలో ఎల్లోస్  స్టీమ్ లో మార్చ్ ఫాస్ట్ చేసేవాడిని. అంతేకాదు బ్యాండ్  సైతం నేర్చుకున్నాను. ఇక అంతే lకాకుండా ధ్రువ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ గా నటించేందుకు చాలా కష్టపడ్డాను. సినిమా చూసిన పోలీసులు నవ్వుకోకుండా ఉండేందుకు సెల్యూట్ నుంచి డ్రెస్ వేసుకోవడం వరకు ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేశాను.

ప్రస్తుతం ఆర్.ఆర్. ఆర్ సినిమాలోనూ పోలీస్ పాత్రలో నటిస్తున్నాను. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నప్పటికీ గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసులు, నన్ను పోర్ట్ ముగింపునకు ముఖ్యఅతిథిగా పిలవడంతో, సెట్లో నేను అల్లుడు అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్నప్పటికీ, పోలీసులు పిలిచారు అనే కారణంతో గంటన్నరపాటు మేకప్ తొలగించుకుని ఇక్కడికి వచ్చాను. ఇక కోవిడ్  సమయంలో పది నెలల పాటు పోలీసులు,డాక్టర్లు అంకితభావంతో పని చేశారు.
ఇంతలా ఎప్పటికప్పుడు పోలీసులు రియల్ హీరో ల లాగా కష్టపడుతుంటే, వారికి ఎప్పుడూ మనం రుణపడి ఉంటాము.  సినిమాలో ఎప్పుడైనా నాకు పోలీస్ పాత్ర వస్తే మాత్రం, కథ వినకుండానే ఓకే చెప్పేస్తాను. పోలీస్ పాత్ర అంటే నాకు ఎనలేని గౌరవం" అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మీటింగ్ లో పాల్గొన్న సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ.. "స్పోర్ట్స్ మీట్ లో ఏడు జట్లు పాల్గొన్నాయి.తొలిసారి మినిస్ట్రియల్  సిబ్బందికి కూడా అవకాశం కల్పించాము." అని చెప్పుకొచ్చారు. ఇక తర్వాత విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ  కార్యక్రమంలో జాతీయ ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, కార్యదర్శి కృష్ణ ఏదుల తో పాటు తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: