జబర్దస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ ఓ వైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో అలరిస్తోంది. సినిమాలో నటించడమే కాకుండా ఐటమ్ సాంగ్స్ లో హీరోల పక్కన స్టెప్పులు వేస్తూ అలరిస్తోంది. ఇప్పటికే అనసూయ సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విన్నర్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో డ్యాన్స్ చేసింది. అంతే కాకుండా "ఎఫ్ 2" సినిమాలోనూ ఓ ఐటమ్ సాంగ్ కి డ్యాన్స్ చేసింది. అనసూయ చేసిన ఈ రెండు సినిమాల పాటలు థియేటర్ లో మొగినప్పుడు కేకలు, విజిల్స్ వినిపించాయి. దాంతో ఈ అమ్మడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాంతో అనసూయను వెతుక్కుంటూ ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెమ్యునేషన్ కూడా పెంచేసి ఫుల్ గా సంపాదించేస్తుంది ఈ బ్యూటీ. ఇక తాజాగా ఈ హాట్ బ్యూటీ "చావు కబురు చల్లగా" అనే సినిమాలో ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేస్తోంది. ఆ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాలో కార్తికేయ..లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాలో అనసూయ స్టెప్పులు వేస్తున్న ఐటెమ్ సాంగ్ కి రూ.20 లక్షలు తీసుకుంటుందట. అది కూడా కేవలం 3 నిమిషాల పాటకి అంత తీసుకుంటుందట. అనసూయ అంత తీసుకున్నా మేకర్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం "థాంక్యూ బ్రదర్" సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాలో అనసూయ ప్రెగ్నెంట్ లేడీగా కనిపించబోతుంది. తొమ్మిది నెలల ప్రెగ్నెట్ లేడీ లిఫ్ట్ లో ఇరుక్కున్నప్పుడు జరిగే సంఘటన ఆధారం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా అనసూయ ఈ సినిమాలో కనిపించబోతునట్టు తెలుస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: