రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి వాళ్లు ఉంటే బాగుండు.. అనిపించే సినీ క్యారెక్టర్స్..

Divya

నాటి నుంచి నేటి వరకు సినిమాలన్నీ సోసియో ఫాంటసీ ని ఫాలో అవుతున్నాయి. అసలు సోసియో ఫాంటసీ అంటే ఏమిటి? కొన్ని సినిమాలలో పూర్వకాలంలో ఎలా ఉండేదో లేదా ఒకవేళ ఈ కథ ఆ టైంలో జరిగితే ఎలా ఉంటుందో అన్నట్లు చూపించే దానినే సోసియో ఫాంటసీ అంటారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం చాలా నాచురల్ గా ఉంటాయి. కొన్ని పాత్రలు మనం తరచూ చూసే వాళ్లలాగే అనిపిస్తాయి. వారి ఆలోచన, ప్రవర్తన కూడా అచ్చం అలాగే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సినిమాలలో చూసే పాత్రలను  నిజం లైఫ్ లో కూడా ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుందో  అని అనిపించేలా వుంటాయి. అయితే ఆ కొన్ని క్యారెక్టర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
విజయ్ గోవింద్ - గీతగోవిందం:
ఒక భార్య పై భర్త చూపించే ప్రేమ ఎలా ఉంటుందో? అని  అద్భుతంగా ఈ సినిమాలో చూపించారు.  ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన ప్రతి ఒక్కరూ  విజయ్ గోవింద్ లాంటి వ్యక్తి వాళ్ల జీవితాల్లో ఉంటే ఎంత బాగుంటుందో అని సోషల్ మీడియా ద్వారా చాలామంది కామెంట్స్ కూడా చేశారు.
అరవింద్ - బొమ్మరిల్లు:
ప్రపంచంలో అందరికన్నా తన కొడుకు మాత్రమే బెస్ట్ అవ్వాలి అని ఆలోచించినప్పటికీ చివరికి కొడుకు కు  నచ్చింది మాత్రమే ఇవ్వాలని అనుకుంటాడు తండ్రి. ఈ పాత్రలో ప్రకాష్ రాజ్  జీవించారు.
భువన - రఘువరన్ బీటెక్:
తల్లి కి మరో పేరు గా నటించింది భువన. ఈ పాత్ర సినిమా చూసిన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.
శ్రావణి - మజిలీ:
భర్త ఎలాంటివాడైనా భార్య ప్రేమించాలి అనే సారాంశంతో చక్కగా తెరకెక్కించారు ఈ చిత్రంలో.  ఇక శ్రావణి గా నటించిన సమంతకు ప్రశంసల వర్షం కురిసింది.
లక్ష్మీ  - అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి:
తల్లి కొడుకుల మధ్య రిలేషన్ ని తన స్టైల్లో చాలా బాగా చూపించారు పూరి జగన్నాథ్.
రాధిక - వాసు:
ఈ సినిమాలో తనని ఎవరు నమ్మినా నమ్మకపోయినా రాధిక మాత్రం వాసు తను అనుకున్నది కచ్చితంగా సాధిస్తాడని నమ్ముతుంది.
శివ-  అర్జున్ రెడ్డి:
స్నేహితుడంటే కష్టాల్లో కూడా విడిపోకూడదనే  సారాంశాన్ని చక్కగా చూపించారు.
బేబీ - ఓ బేబీ :
తన మనువడు  చేసే ప్రతి పనిని సపోర్ట్ చేస్తుంది బేబీ.
చిత్ర -  పెళ్లి చూపులు:
చిత్ర తను అనుకున్నది అనుకున్నట్లుగా ధైర్యంగా మాట్లాడుతుంది. తన నిర్ణయాలను తీసుకుంటుంది. మధ్యలో ఎన్ని ఆటంకాలు కలిగినప్పటికీ తను అనుకున్నది మాత్రం సాధిస్తుంది. ఇక ఈ చిత్రంలో చిత్ర పాత్ర చాలా మందికి స్పూర్తిని ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: