బాలీవుడ్ కు వెళ్తున్న క్రాక్.. డైరక్టర్ ప్లానింగ్ అదిరింది..!

shami
గోపీచంద్ మలినేని డైరక్షన్ లో మాస్ మహరాజ్ హీరోగా వచ్చిన సినిమా క్రాక్. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ కాంబినేషన్ లో వచ్చిన క్రాక్ కూడా హ్యాట్రిక్ హిట్ అందించింది. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక కెరియర్ లో వెనకపడ్డ రవితేజ క్రాక్ తో మళ్లీ హిట్ ఫాం లోకి వచ్చేశాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన క్రాక్ సినిమా హిందీలో కూడా రీమేక్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
తెలుగు సినిమాలకు హిందీలో మంచి డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు అక్కడ సినిమాలు ఇక్కడ రీమేక్ అయ్యేవి కాని తెలుగులో మంచి కంటెంట్ తో సినిమాలు వస్తుండటంతో ఇక్కడ సినిమాలు అక్కడ రీమేక్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్ కూడా టాలీవుడ్ సినిమాలపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇక క్రాక్ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడట డైరక్టర్ గోపీచంద్. ఆల్రెడీ బాలీవుడ్ నిర్మాతలతో డిస్కషన్స్ జరుగుతున్నాయట.
బాలీవుడ్ స్టార్ హీరోతో క్రాక్ హిందీ రీమేక్ ఉంటుందని తెలుస్తుంది. రవితేజ మాస్ ఫాలోయింగ్ కు పర్ఫెక్ట్ గా సూటయ్యేలా వచ్చింది క్రాక్. అందుకే 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతోనే సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రవితేజకు క్రాక్ ఇచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రాక్ తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. రాజా ది గ్రేట్ తర్వాత క్రాక్ తో వచ్చిన ఈ సూపర్ హిట్ ను రవితేజ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు.                                            

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: