నేను ఎక్స్ పోజింగ్ చేస్తా ...

ఇలా ఓ కొత్త హీరోయిన్ అంటోంది అనుకుంటున్నారా? త్వరలోనే సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తా అంటున్న జెనీలియా అంటున్న మాట ఇది. ఒకప్పుడు ‘అందాల ప్రదర్శన’ అంటే అంతెత్తు ఎగిరిపడేదీ అమ్మడు. మరి, ఇప్పుడు ‘పాత్ర డిమాండ్ చేస్తే అందాల ప్రదర్శన తప్పుకాదు’ అంటోంది. అక్కడితో ఆగిందా... అవసరమైతే కాస్త అతిగానైనా ఎక్స్ పోజింగ్ చేయడానికి తను రెడీ అనేసింది. ఈ వార్త అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ చర్చనీయాంశంగా మారింది. రితీష్ దేశ్ముఖ్ తో పెళ్లయ్యాక ‘ఇక సినిమాలు చేయను’ అన్న జెనీలియా ఇలా ఎందుకు రూటు మార్చిందో అంటూ గుసగుసలాడుతున్నారు. ‘అదేంటయ్యా... నీ భార్య అలా అంటోంది’ అని రితీష్ ని అడిగితే... ‘నో కామెంట్స్’ అంటున్నాడట. నిన్నేమో ‘జెనీలియా సినిమాల్లో నటించకపోయినా ఫర్వాలేదు’ అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. మరి ఈ మతలబు ఏంటో? అందాల ప్రదర్శనకు సై అంటే అవకాశాలు అమాంతంగా వచ్చిపడతాయని అనుకుంటోందేమో జెనీలియా. మొత్తానికి హాసినీ సెకెండ్ ఇన్నింగ్స్ హాట్ హాట్ గా ఉంటుందన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: