వదిలి వెళ్లాలని లేదు.. తెగ ఫీల్ అవుతున్న కీర్తి సురేష్..?
అయితే ఇటీవలే కీర్తి సురేష్ ఓ విషయంలో తెగ ఫీల్ అయిపోయింది. నిన్ను వదిలి వెళ్లాలని లేదు అంటూ ఎంతో బాధ పడి పోయింది.. కానీ ఏం చేస్తాం వెళ్ళక తప్పడం లేదు అంటూ ఎమోషనల్ అయ్యింది.. నీతో నాకు ఎప్పుడూ హగ్గింగ్ డే అంటూ భావోద్వేగానికి గురైంది.. తాను తిరిగి వచ్చే వరకు మంచిగా ఉండు అంటూ సూచనలు కూడా ఇస్తుంది. ఇంతకీ కీర్తి సురేష్ ఎవరి కోసం ఇంతలా ఫీల్ అయి పోతుంది అని అనుకుంటున్నారా.. తన పెంపుడు కుక్క నైక్ గురించి. తరచూ కీర్తి సురేష్ తన పెంపుడు నైక్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రస్తుతం కీర్తి సురేష్ షూటింగ్ నిమిత్తం దుబాయ్ వెళ్లాల్సి ఉండగా తన కుక్క పిల్లలను వదిలి వెళ్లేందుకు ఎంతో ఫీల్ అవుతుంది కీర్తి సురేష్. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన పెంపుడు కుక్క తో తీసుకున్న ఫోటోను షేర్ చేసిన కీర్తి సురేష్.. నీకు గుడ్ బై చెప్పడం ఎంతోకష్టంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది . మిస్ యూ అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ దుబాయ్ లో షూటింగ్ కోసం బయలుదేరింది. ఇప్పటికే మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లగా ఇక ఇప్పుడు కీర్తి సురేష్ కూడా షూటింగ్ కోసం కదిలింది.