రాధిక నా అమ్మ కాదు... వరలక్ష్మి శరత్ కుమార్...?

Shirisha
వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ సినిమాలో న‌ట‌న‌తో పాటు ప‌లు విష‌యాల‌పై ముక్కు సూటిగా మాట్లాడి సినీ ప్రేక్ష‌కుల్లో ఎంతో పాపుల‌ర్ అయ్యారు. సందీప్ కిష‌న్ హీరోగా తెర‌కెక్కిన తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది ఈ ఫైర్ బ్రాండ్‌‌. ఇటీవ‌లే ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన క్రాక్ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ జ‌య‌మ్మ అనే కీల‌క పాత్ర‌ల్లో న‌టించింది. ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంతో, ఇక్క‌డి ప్రేక్ష‌కుల్లో జ‌య‌మ్మ‌గా వ‌ర‌ల‌క్ష్మీ ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. కాగా ఆమె మాట‌లు ముక్కు సూటిగా ఉంటాయి.తెలుగు, తమిళ భాషల్లో నెగిటివ్ పాత్రల్లో ఎక్కువగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్.
ఇటీవల కాలంలో లేడీ విలన్ అవసరమైతే  అందరికి గుర్తొచ్చే మొదటిపేరు వరలక్ష్మీ శరత్ కుమార్ అనే చెప్పుకోవాలి.  ఇప్పుడు లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మీ శరత్ కుమార్ పెట్టింది పేరుగా మారింది. ముందుగా హీరోయిన్ గా తన కెరియర్ ను ప్రారంభించినప్పటికీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అలరిస్తుంది. ‘విక్రమ్ వేదా’ ‘విష్మయ’ ‘మాణిక్యా’ ‘కసాబా’ వంటి చిత్రాల్లో అద్భుతమైన యాక్టింగ్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది . ఇక ‘పందెం కోడి 2′ ‘సర్కార్’ వంటి చిత్రాల్లో లేడీ విలన్ గా కనిపించి సత్తాచాటింది. ఇలా ఆమె పోషించిన సినిమాలు .. పాత్రలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
తన సవతి తల్లి రాధిక గురించి వరలక్ష్మీ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. క్రాక్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న వరలక్ష్మీ సవతితల్లి, నటి రాధిక గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.రాధిక  నా తల్లి కాదు. ..కానీ  తనతో ఫ్రెండ్లీగా ఉంటుందని ఆమె చెప్పారు.నా తండ్రికి రెండో భార్య‌. ఈ విష‌యంలో మేమంతా సంతోషంగానే ఉన్నాం. కానీ బ‌య‌ట బోలెడ‌న్ని పుకార్లు వ‌స్తుంటాయి. రాధిక‌కు నాకు ప‌డ‌ద‌ని అంటుంటారు. కానీ మా ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. నా తండ్రి, రాధిక ఇద్ద‌రినీ నేను స‌మానంగా గౌర‌విస్తాను. వాళ్ల‌కు వ్య‌తిరేకంగా ఏమీ చేయ‌ను అని ఫైర్‌బ్రాండ్ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ తెలిపింది.అంతేకాదు నా కెరియర్ కు సంబందించిన సూచనలు, గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. అయితే నేను ఎప్పుడైనా ఆమెకు ఏదైనా రహస్యం చెబితే.. మాత్రం దాన్ని వెంటనే అందరికీ లీక్ చేసేస్తుంది.అయితే అందులో దురుద్దేశం ఉండదు.. అలా పొరపాటున జరిగిపోతుంది.ఇలా నా రహస్యాలను లీక్ చేసి చాలా సార్లు నన్ను ఇబ్బంది పెట్టారు అంటూ తన సవితి తల్లి రాధిక గురించి చెప్పుకొచ్చింది. వరలక్ష్మి.సవతి తల్లి గురించి వరలక్ష్మీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: