బెస్ట్ ఫ్రెండ్ భర్త అయితే ఎలా ఉంటుందో తెలుసా?.. హీరోయిన్ కామెంట్స్!
ఇప్పటికీ సౌత్ ఇండస్ట్రీలతో పాటు నార్త్ ఇండస్ట్రీలో కాజల్ కు అవకాశాలు దొరుకుతున్నాయి. దీంతో ఆమె పెళ్లయినా కూడా తన హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోందీ అమ్మడు. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవితో మరో సారి జత కట్టి.. ‘ఆచార్య’ సినిమాలో ఆడి పాడుతోంది. అలాగే స్టార్ హీరో కమల్ హాసన్ సరసన భారతీయుడు - 2 లో నటిస్తోంది. ఇక కాజల్ పెళ్లి జరిగిన తర్వాత నుండి భర్తతో కలిసి వార్తల్లో నిలుస్తూనే ఉంది. పెళ్లి అయిన వెంటనే హనీమూన్ కి మాల్దీవ్స్ వెళ్లిన కాజల్ దంపతులు.. తాజాగా కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా కాజల్ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికలో షేర్ చేసింది. 'నా బెస్ట్ ఫ్రెండే నా భర్త కావడం చాలా ఆనందంగా ఉంది' అంటూ భర్తతో దిగిన ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో కాజల్ మెరిసిపోతోందని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం కాజల్ దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి.