దొరబాబు పరువు తీసిన రోజా.. స్కిట్ జరుగుతుంటే పోలీసుల గురించి మాట్లాడుతూ..?

praveen
సాధారణంగా ఈ టీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి వారం కూడా సరికొత్త స్కిట్ లతో  కమెడియన్స్  ఎంట్రీ ఇచ్చి  బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటారు అని విషయం తెలిసిందే. అయితే జబర్దస్త్ లో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన టీమ్ ఏదైనా ఉంది అంటే అది హైపర్ ఆది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త స్కిట్స్  తో ప్రేక్షకుల ముందుకు వచ్చే హైపర్ ఆది తన పంచల వర్షంతో అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే.

 ఇక ఇటీవలే వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలై  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమోలో  హైపర్ ఆది స్కిట్ కి చెందిన సన్నివేశం రాగా.. హైపర్ ఆది ఎప్పటిలాగానే తనదైన కామెడీ పంచ్ లతో వరుసగా పంచుల వర్షం కురిపించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.  సాధారణంగా హైపర్ ఆది స్కిట్ వస్తున్న సమయంలో దొరబాబు మీద ఏదోవిధంగా వైజాగ్ లో  జరిగిన సంఘటనకు సంబంధించి పంచులు వేస్తూ ఉంటాడు హైపర్ ఆది. ఇక ఇటీవల ఇలాంటి తరహా పంచ్ వేయగా  వెంటనే కలగజేసుకున్న జడ్జి రోజా మరో పంచ్ వేస్తుంది.

 ఇక ఈ ప్రోమోలో  భాగంగా హైపర్ ఆది ఎప్పటిలాగానే తన పంచులతో రైజింగ్ రాజు ఆడుకున్నాడు. మన  ప్రేమ రష్మీ సుధీర్ ల కంటే ఎంతో గొప్పదని..  8 సంవత్సరాల పైబడిన ప్రేమ అని ఈ విషయంలో రష్మీ సుధీర్ లు కూడా పనికిరారు అంటూ రైజింగ్ రాజు.. దొరబాబు తో అంటే వెంటనే కలుగజేసుకుని హైపర్ ఆది మీది గుడ్డి ప్రేమ కాదు ముసలి ప్రేమ అంటూ పంచ్ వేస్తాడు. ఇంతలో స్కిట్ లో  ఎక్కువ చేస్తే జైల్లో వేస్తాం అంటూ  పోలీస్ గెటప్ లో వచ్చిన వారు అనగానే నాకు జైలు కొత్తేం కాదు అంటూ దొరబాబు అంటారు. అదే సమయంలో కలగజేసుకున్న  రోజా జైల్లో పోలీసులు అలవాటు అయిపోయారు అంటూ పంచ్  చేయడంతో అందరూ నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: