పవర్ స్టార్ రేంజికి ఏమాత్రం తగ్గకుండా ఫ్యాన్సీ ధరకు అమ్ముడైన వకీల్ సాబ్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీని ఏలడానికి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం కొన్ని కోట్లాది మంది అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు  జరుగుతున్నాయి. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే వున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ ను లాయర్ గెటప్ లో నటిస్తున్నాడు. ఆ గెటప్ లో పవర్ స్టార్ ని  చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో  ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం అందుతుంది.

ప్రముఖ ఛానెల్ జీ తెలుగు ఈ సినిమా  రైట్స్ ను కొన్నట్లు  సమాచారం అందుతుంది. నిర్మాత దిల్ రాజు, జీ తెలుగు ప్రతినిధుల మధ్య చర్చలు పూర్తయ్యాయట. ఓ స్టార్ హీరో సినిమాకి శాటిలైట్ రైట్స్ డీల్ ఇంత ఆలస్యంగా జరగడం ఆశ్చర్య కలిగించే విషయమే అయినా.. దీని వెనుక చాలా పెద్ద స్టోరీ నడిచిందట. ‘వకీల్ సాబ్’ సినిమా సెట్స్ పైకి వెళ్లిన వెంటనే జెమినీ ఛానెల్ రంగంలోకి దిగింది. దిల్ రాజుతో సూచనప్రాయంగా ఓ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.

 కానీ ఆఖరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల డీల్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అలా జెమినీ తప్పుకోవడంతో ఆ అవకాశాన్ని జీ తెలుగు అందుకోవాలనుకుంది. దాదాపు రూ.15 కోట్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు  తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా శాటిలైట్ హక్కులకు ఫ్యాన్సీ రేటు పలికిందనే చెప్పాలి. సంక్రాతి కానుకగా రేపు సాయంత్రం ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. టీజర్ తో పాటు సినిమా విడుదల తేదిని  కూడా ప్రకటిస్తారేమోనని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: