రంభ ఊర్వశి మేనక.. అల్లుడు అదుర్స్ మోనాల్ సాంగ్ కేక..!

shami
బిగ్ బాస్ మోనాల్ గజ్జర్ కెరియర్ కు మంచి ఊపు తెచ్చిందని చెప్పొచ్చు. అంతకుముందు తెలుగులో ఐదారు సినిమాలు చేసిన మోనాల్ ఆ తర్వాత ఫేడవుట్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో ఆమె సర్ ప్రైజ్ ఇచ్చింది. ఫైనల్ వీక్ కు ముందు వారం ఎలిమినేట్ అయిన మోనాల్ తను కోల్పోయిన ఇమేజ్ ను తిరిగి తెచ్చుకుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ నుండి బయటకు రాగానే స్టార్ మా డ్యాన్స్ ప్లస్ లో జడ్జ్ గా ఛాన్స్ అందుకున్న మోనాల్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది.

జనవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలోని మోనాల్ గజ్జర్ సాంగ్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. రం ఊర్వసి మేనక అంటూ మోనాల్ ఓ రేంజ్ లో అదరగొట్టింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో కరెక్ట్ టైం లో ఈ ఐటం సాంగ్ రానుందట. ఇక బిగ్ బాస్ తో ప్రేక్షకులకు దగ్గరైన మోనాల్ ఈ సాంగ్ తో మరింత క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది. బిగ్ బాస్ పూర్తి కాగానే ఆ పాపులారిటీని వాడుకున్న మొదటి హౌజ్ మేట్ మోనాల్ గజ్జర్ అని చెప్పొచ్చు.

ఇక ఈ స్పెషల్ సాంగ్ క్లిక్ అయితే ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే వీలుంటుంది. దేవి మ్యూజిక్, బెల్లంకొండ బాబు స్టెప్పులతో పాటుగా మోనాల్ గజ్జర్ అందాలు కూడా ఈ స్పెషల్ సాంగ్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని తెలుస్తుంది. సాంగ్ లిరిక్స్ ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంటే థియేటర్ లో ఈ సాంగ్ దద్దరిల్లిపోవడం ఖాయమని చెప్పొచ్చు. సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సోనూ సూద్, ప్రకాశ్ రాజ్ కూడా నటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: