ఈటివిలో మరో స్పెషల్ షో.. శ్రీదేవి డ్రామా కంపెనీ.. ప్రోమో అదిరింది..!

shami
కామెడీ షోలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది ఈటివి. జబర్దస్త్ ముందు వరకు కార్పోరేట్ ఛానెళ్ల ధాటికి నిలవడం కష్టం అనిపించేలా ఉన్న ఈటివి ఢీ, జబర్దస్త్ షోలతో నెంబర్ 1 రేసులో నిలిచింది. 12 సీజ్ఞలుగా ఢీ, ఐదారేళ్లుగా జబర్దస్త్ ఈ రెండు రియాలిటీ షోలు ఈటివిని టాప్ ప్లేస్ లో నిలిచేలా చేశాయి. మల్లెమాల టీం తో ఈటివి వారు చేస్తున్న స్పెషల్ షోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈటివిలో లేటెస్ట్ గా వస్తున్న స్పెషల్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ.

ఈ స్పెషల్ ఎపిసోడ్ కు సంబందించిన స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశారు. జబర్దస్త్ లో పాపులర్ అయిన వారితో పాటుగా ఈటివి పలు రకాల షోస్ తో ఫేమస్ అయిన వారందరిని తెచ్చి ఈటివి ఏర్పాటు చేసిన సరికొత్త షో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ డ్రామా కంపెనీ ఎలా ఉంటుంది అన్నది శాంపిల్ గా ప్రోమోలో వదిలారు. ఇప్పటికే ఈటివి షోస్ కు పోటీగా ఏదో ఒకటి చేయాలని మిగతా ఛానెళ్లు పోటీ పడుతుంటే ఈటివితో మల్లెమాల టీం కొత్తగా శ్రీదేవి డ్రామా కంపెనీ అని సరికొత్త షోని మొదలు పెడుతుంది.

ఈ షో కూడా జబర్దస్త్ రేంజ్ లో సక్సెస్ అయ్యేలా ఉంది. కామెడీ షో చేయాలంటే అది ఈటివి తర్వాతే అనిపించేలా ఈ షోస్ ప్లానింగ్ జరుగుతున్నాయి. జబదస్త్ కు పోటీగా జీ తెలుగులో మొదలు పెట్టిన అదిరింది, బొమ్మ అదిరిందిల సందడి ముగిసినట్టే అంటున్నారు. సో ఈటివిలో ఈ షో ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తుందని చెప్పుకోవచ్చు.                           



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: