నేను "రెండో పెళ్లి "చేసుకోవడానికి కారణం వారే: సునీత

Divya
సునీత అంటే తెలియని వారు ఉండరు. ఈమె తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతమంది సింగర్లు ఉన్నప్పటికీ, కొంత మంది మాత్రం తమ దైన శైలిలో శ్రుతి మెత్తని,కోకిల లాంటి గొంతుతో స్వరాలు వినిపించి ప్రేక్షకులను మైమరపింప చేస్తుంటారు. ఇక సింగర్ల  విషయానికొస్తే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అనగానే  చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఈయన పాటలు విని మైమరచిపోతూ ఉంటారు. మనసు ఉత్సాహంగా ఉన్నప్పుడు,మనసు బాగోలేనప్పుడు,పండుగలు వచ్చిన, విషాదం వచ్చిన అసలు ఏం జరిగినా ఆయన పాటలను ఇప్పటికీ మనం స్మరించుకుంటూనే ఉన్నాము.గత కొద్ది రోజుల క్రితం బాలసుబ్రహ్మణ్యం గారు స్వర్గస్తులయ్యారు. చలన చిత్ర పరిశ్రమతో పాటు ఎంతోమంది ప్రేక్షకులకు దూరమయ్యారు. ఈయన లేని లోటు ఇప్పటికీ ఎప్పటికీ ఎవరూ తీర్చలేనిదని  చెప్పవచ్చు.
ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనకు పోటీగా ఏ ఒక్క సింగరు నిలువలేకపోయారు. కానీ ఆయన స్థాయికి నేటి తరం సింగర్లు కూడా చేరుకోకపోయినప్పటికీ తమ అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించిన వాళ్ళు ఉన్నారు. వారిలో ఒక్కరే సింగర్ సునీత. ఈమె రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గులాబీ అనే సినిమాలో "ఈ వేళలో నీవు,ఏం చేస్తూ ఉంటావో"అనే సూపర్ హిట్ సాంగ్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈమె,ఆ తర్వాత 200 తెలుగు సినిమాలలో మూడు వేలకు పైగా పాటలు పాడి కొత్త రికార్డును సృష్టించింది. ఈమె టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. అంతే కాకుండా కొద్ది రోజుల క్రితం వచ్చిన 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అనే సినిమాలో "నీలి నీలి ఆకాశం" అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే మనకు అర్థమవుతుంది సునీత ఎంత  పెద్ద సింగరో
అయితే గతకొద్దికాలంగా ఈమె గురించి నెట్టింట్లో కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందుకు కారణం ఆమె రెండో పెళ్లి చేసుకోవడం. హైదరాబాద్ లోని టాప్ టెన్ బిజినెస్ మాన్ లో ఒక్కరైనా రాము ను ఈమె పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సునీత 19 ఏళ్లకే కిరణ్ కుమార్ ను పెళ్లి చేసుకొని,ఆ తర్వాత కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయారు. అయితే ఈమెకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు పేరు ఆకాష్,కూతురు పేరు శ్రేయ. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంతమంది నెటిజనులు పెళ్లి వయసుకు వచ్చిన కొడుకు, కూతురు ని పెట్టుకొని ఈమె ఈ వయసులో కూడా రెండో పెళ్లి చేసుకోవడం అవసరమా అని, సోషల్ మీడియా ద్వారా కామెంట్ పెడుతుంటే, ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను అప్డేట్ చేసే సునీత గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది.
ఈ కామెంట్స్ తట్టుకోలేక ఆమె మాట్లాడుతూ" ప్రతి ఒక్క తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తు కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడతారు.  కానీ అదే స్థాయిలో తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా బాగుండాలని పిల్లలు కోరుకునేవారు చాలా మంది ఉన్నారు.అలాంటి తల్లిదండ్రుల భవిష్యత్తును కోరుకునే పిల్లలు నాకు ఉండడం నా అదృష్టం. వారిద్దరు నా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతారు. ఈరోజు రామ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా వారిద్దరే . రామ్ నాకు ముందు  నుంచి చాలా మంచి స్నేహితుడు.తరచూ మా ఇంటికి వస్తుండేవాడు. అలా తన మంచి ప్రవర్తన మా పిల్లలకు నచ్చి,ఈరోజు నేను తనని పెళ్లి చేసుకునేలా చేసింది" అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: