2021 లో జరగబోతున్న ఆద్భుతాలు !

Seetha Sailaja
2021 ప్రవేశించి 10 రోజులు పూర్తి కాకుండానే ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న రెండు వార్తలు చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘పుష్ప’ మూవీ కథలో అల్లు అర్జున్ పాత్రతో సరిసమానమైన ఒక సిస్టర్ పాత్ర ఉందని తెలుస్తోంది. చాల కాలం తరువాత చెల్లి సెంటిమెంట్ తో రాబోతున్న ఈ మూవీ కథ అంతా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో జరుగుతుంది.


దర్శకుడు సుకుమార్ ఈ మూవీ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ తీసుకు రావడానికి ఈ మూవీలోని చెల్లి పాత్రను సాయి పల్లవితో చేయిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై సుకుమార్ సాయి పల్లవిని సంప్రదించినప్పుడు. ఆమె బన్నీ చెల్లెలుగా నటించే విషయంలో అభ్యంతరం తెలపకుండా 2 కోట్ల పారితోషికాన్ని అడిగినట్లు టాక్.


ప్రస్తుతం ఈమె పవన్ కల్యాణ్ తో ‘అయ్యప్పన్ కొషియం’ మూవీలో హీరోయిన్ గా నటించడానికి 2 కోట్లు తీసుకుంటున్న పరిస్థితులలో అదే స్థాయిలో చెల్లి పాత్ర అయినప్పటికీ తనకు రెండు కోట్లు కావాలని సాయి పల్లవి డిమాడ్ చేసినట్లు లీకులు వస్తున్నాయి. దీనితో సుకుమార్ ఆలోచనలలో పడి ఇంత భారీ పారితోషికం ఈ మూవీలో నటిస్తున్న రష్మిక తో సమానంగా సాయి పల్లవికి ఇవ్వడం ఎంతవరకు అవసరం అని ఆలోచనలలో పడినట్లు టాక్.


ఇది ఇలా ఉంటే మహేష్ నటిస్తున్న ‘సర్కారు వారి పాటలో’ కీలకమైన వదిన పాత్రలో నటించడానికి రేణు దేశాయ్ తో ఇప్పటికే దర్శకుడు పరుశు రామ్ రాయబారాలు నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రలో నటించే విషయంలో రేణు దేశాయ్ కోటి రూపాయలు అడిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు ఇలా వీరిద్దరి ఊహించని కాంబినేషన్స్ సెట్ అయితే ఈ రెండు సినిమాలకు మరింత క్రేజ్ పెరిగి ఈ సంవత్సరంలో జరగబోతున్న ఊహించని అద్భుతాలు అని అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: