చిక్కుల్లో ప్రముఖ నటి...అసలేమైందో తెలుసా...?

VAMSI
కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో ఎవరూ ఊహించలేము. అయితే ఇప్పుడు మరో విషయంతో వార్తల్లో కెక్కింది  కర్ణాటక రాజకీయం. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ కి చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ చోటా నాయకుడు యువరాజ్‌... చీటింగ్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో ఓ నటి అడ్డంగా బుక్ కావడం సంచలనంగా మారింది. ఈమె మరెవరో కాదు కన్నడ నటి రాధికా కుమారస్వామి. నిందితుడు యువరాజ్ బ్యాంక్ అకౌంట్ నుండి రాధిక అకౌంట్ కు పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయిందని ఆరోపణలు వినబడుతున్నాయి.

యువరాజ్‌ బ్యాంకు ఖాతా నుంచి నటి రాధికా కుమారస్వామి మరియు మరో నిర్మాతకు కోటి రూపాయిల వరకు బదిలీ అయినట్లు సీసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు విచారణ జరిపేందుకు నిర్ణయించారు. అయితే ఈ విషయంపై రాధిక ఈ విధంగా స్పందించారు. యువరాజ్‌ కుటుంబానికి – తమ కుటుంబానికి మధ్య స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నాయని... మా ఇరు కుటుంబాలు ఎప్పటినుండో సన్నిహితంగా ఉంటున్నాయని... రాధికా కుమారస్వామి తెలిపారు. బెంగళూరు డాలర్స్‌ కాలనీలో విలేకర్లతో బుధవారం మాట్లాడిన ఆమె ఇలా అన్నారు. యువరాజ్ అకౌంట్‌ నుంచి నా అకౌంట్ కు రూ.15 లక్షలు బదిలీ అయిన మాట వాస్తవమే.

కానీ ఒక సినిమా అడ్వాన్స్‌గా తన ఖాతాకు బదిలీ అయిందన్నారు. అయితే అంతా అనుకుంటున్నట్లుగా తన తమ్ముడు రవిరాజ్‌ అకౌంట్‌కు మాత్రం డబ్బు ఏమి బదిలీ కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సీసీబీ అధికారులు ఏ క్షణమైనా రాధికా కుమారస్వామిని అదుపులోకి తీసుకునే అవకాశముంది. ఇంతకీ వాస్తవంగా జరిగిన విషయాలు ఇంకా బయటకు రాలేదు. ఈ విచారణలో రెండు మూడు రోజులలోనే మరికొన్ని వాస్తవాలు బయటపడే అవకాశముంది. దీనిపై సీసీబీ అధికారులు ఇంకా స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: