సొట్టబుగ్గల సుందరి కల నెరవేరుతుందా..?
మళ్లీ ఓ సినిమా చేసి పెడతానంటుంది. తెలుగు పరిశ్రమను, దర్శకులను అంతలా కామెంట్ చేసిన ఈ సుందరిని తెలుగువాళ్లు ఇప్పుడు ఎంతవరకు లైక్ చేస్తారంటారు.
బాలీవుడ్ లో లీడింగ్ బ్యూటీగా కంటిన్యూ అవుతున్న తాప్సీ ఇప్పుడు సౌత్ కు వచ్చి సినిమా చేయాలని చూస్తుంది. ఇందుకోసమని తనకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ నే ఎంచుకుంది. కాజల్ ప్లేస్ రీప్లేస్ చేస్తూ అమ్ముడు ఓ తెలుగు ప్రాజెక్ట్ లో తళుక్కుమనబోతుంది.
తాప్సీకి తెలుగుకు కావాలని అయితే రాలేదు. డైరెక్టర్ తేజ పనిగట్టుకుని మరీ తాప్సీని తన ప్రాజెక్ట్ లోకి తెచ్చుకున్నాడు. గోపీచంద్ ,కాజల్ తో చేయాల్సిన సినిమాకు స్టార్ క్యాస్ట్ పక్కకు తప్పుకోవడంతో హీరోయిన్ ప్లేస్ ను తాప్సీతో రీప్లేస్ చేయించాడు. ఇక హీరో గోపీచంద్ సైడ్ అయిపోవడంతో ఓ తమిళ యువ హీరోని పెట్టి సినిమా తీయాలని చూస్తున్నాడు.
తాప్సీకి బాలీవుడ్ లో మంచి ఇమేజే ఉంది.చేతిలో బోలెడు సినిమాలున్నాయి. అయినప్పటికీ తనకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ కు రావడం విశేషమనే చెప్పుకోవాలి. ఇక తేజ చెప్పిన లైన్ నచ్చడంతోనే తాను కాల్షీట్స్ ఇచ్చినట్లు ఈ సొట్టబుగ్గల సుందరి చెబుతుంది. నీవెవరో, గేమ్ ఓవర్ తర్వాత తెలుగులో కనిపించని ఈ సుందరి... తేజ సినిమాతో ఇప్పుడిలా ఎంట్రీ ఇవ్వడం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.హీరోయిన్లను బాగా ప్రజంట్ చేస్తాడనే పేరున్న తేజ..తాప్సీ విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడో చూడాలి. మొత్తానికి తాప్సీ.. టాలీవుడ్ లో మళ్లీ తన టాలెంట్ ఏంటో చూపించేందుకు సొట్టబుగ్గల సుందరి తాప్సీ సిద్ధమవుతోంది. చూద్దాం.. ఆమె అనుకున్నట్టు నెరవేరుతుందో లేదో.