ఇస్మార్ట్ బ్యూటీ కి చేదు అనుభవం.. 'ఐ లవ్ యు' చెప్పాలంటూ స్టేజ్ పై ఇబ్బంది పెట్టిన దర్శకుడు..?

praveen
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో నిధి అగర్వాల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నిధి అగర్వాల్ అటు కన్నడ తమిళ ఇండస్ట్రీలో కూడా వరుసగా ఆఫర్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నది  విషయం తెలిసిందే.  టాలీవుడ్ లో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో  మంచి క్రేజ్ సంపాదించుకున్న నిధి అగర్వాల్ అదే సమయంలో తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం అటు తమిళ కన్నడ భాషలతో పాటు తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది


 ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ అటు సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోలను  అభిమానులతో పంచుకుని  అభిమానులందరినీ హీటేక్కిస్తూ  ఉంటుంది నిధి అగర్వాల్. కాగా ఈ ఇస్మార్ట్ బ్యూటీ కి  ఇటీవలే స్టేజి పైన ఒక చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలకు అనుకోని విధంగా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇక్కడ నిధి అగర్వాల్ కు ఇలాంటి ఘటనే జరిగింది.   స్టేజీపైన దర్శకుడు ఐ లవ్ యు చెప్పాలంటూ పదే పదే కోరడంతో నిధి అగర్వాల్ ఎంతగానో ఇబ్బంది పడింది.

 తమిళ మూవీ ఈశ్వరన్  సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.  అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ కార్యక్రమం నిర్వహించగా..  ఈ కార్యక్రమంలో నిధి అగర్వాల్ పాల్గొని మాట్లాడుతున్న సందర్భంలో నిధి అగర్వాల్ పక్కకు చేరుకున్న దర్శకుడు సుశీంద్రన్...  శింబు మామ ఐ లవ్ యు అని  చెప్పాలి అంటూ  కోరాడు..  అయితే ఇక నిధి అగర్వాల్ టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతుంటే పదేపదే శింబు మామ ఐ లవ్ యు అని  చెప్పు అంటూ కోరడంతో స్టేజ్ మీద నిధి అగర్వాల్ ఎంతో ఇబ్బంది పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: