ప్రియా ప్రకాశ్ లో మరో కొత్త టాలెంట్..!

shami
ఒరు ఆదాల్ లవ్ సినిమా టీజర్ తో సూపర్ పాపులర్ అయిన ప్రియా ప్రకాశ్ కన్నుగీటి కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టింది. స్టార్స్ ను కూడా ఆ ఒక్క టీజర్ తో ఇంప్రెస్ చేసిన ప్రియా ప్రకాశ్ ఆ సినిమా టీజర్ కు వచ్చిన క్రేజ్ తో ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. ప్రియా ప్రకాశ్ క్రేజ్ కు ఈపాటికే తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసి ఉండాలి. కాని యువ హీరోల సినిమాలో ఛాన్స్ వచ్చినా అమ్మడు చేయనని చెప్పడంతో ఆమెకు ఛాన్సులు రాలేదు.

నితిన్ తో చెక్ సినిమాలో చేస్తున్న ప్రియా ప్రకాశ్ లేటెస్ట్ గా తెలుగులో మరో టాలెంట్ చూపిస్తుంది. మరి అమ్మడు తెలుగు నేర్చుకుందో లేక అర్ధాన్ని తెలుసుకుని రాగానికి తగినట్టు పాడిందో కాని తెలుగులో ఓ ప్రైవేట్ సాంగ్ పాడింది ప్రియా ప్రకాశ్. మళయాళ భామ తెలుగు పాట పాడటం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. అమ్మడికి మ్యూజిక్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఉంది. అందుకే ప్రియా ప్రకాశ్ అక్కడ కూడా ప్రైవేట్ సాంగ్స్ పాడుతుంది.

ఆల్రెడీ అక్కడ ఓ సాంగ్ పాడిన ప్రియా ప్రకాశ్ తెలుగులో ఒక సాంగ్ పాడింది. ఈ సాంగ్ త్వరలో రిలీజ్ కానుంది. మ్యూజిక్ డైరక్టర్ శ్రీచరణ్ పాకాల సంగీత సారధ్యంలో వస్తున్న ఈ ప్రైవేట్ సాంగ్ కోసం ప్రియా ప్రకాశ్ గానం అందిస్తుంది. ప్రియా చేస్తున్న ఈ కొత్త టాలెంట్ తెలుగు ఆడియెన్స్ ను ఏమేరకు అలరిస్తుందో చూడాలి. అప్పట్లో రౌడీ హీరో విజయ్ దేవర్కొండతో ఫోటో దిగి ఐలవ్యూ.. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ప్రియా ప్రకాశ్ హీరోయిన్ గానే కాదు సింగర్ గా కూడా సత్తా చాటాలని చూస్తుంది.           

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: