"మనం"లాంటి సినిమా మరొకటి రాగలదా?

Divya

సాధారణంగా ఒక సినిమాలో తండ్రి- కొడుకులు, తాతా-మనవళ్లు, తల్లి-కూతుర్లు, బావ-బామ్మర్దులు, అన్నా-చెల్లెలు, అక్క-తమ్ముడు,  మామా-అల్లుళ్లు అంటూ  జంటగా తెరపై కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు. ఒకే ఫ్యామిలీకి చెందిన ఏ ఇద్దరు వ్యక్తులు వెండి తెరపై కనిపించినా అది ప్రేక్షకులకు కన్నుల పండుగగా వుంటుంది. కానీ ఏకంగా మూడు తరాలకు సంబంధించిన ఫ్యామిలీ వెండితెరపై కనిపిస్తే..? అది  వర్ణనాతీతం.
అక్కినేని వారి కుటుంబం తన మూడు తరాలను ఒకేసారి వెండితెరపై ప్రేక్షకులకు చూపించి ఎనలేని ప్రభంజనాన్ని సృష్టించింది.ఎవరూ ఊహించని ఈ విధంగా, ఏ సినీ ఇండస్ట్రీలోనూ జరగని వింతగా, మన తెలుగు సినీ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ ని బద్దలు కొట్టి భారీ విజయాన్ని చేకూర్చింది "మనం "సినిమా.  మనం సినిమా ఎప్పుడు చూసినా అచ్చం మన తెలుగింటి వారిలాగానే అనిపిస్తుంది. అంత ప్రాముఖ్యతను సంపాదించుకుంది మనం సినిమా.విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని ప్రొడక్షన్స్ నిర్మించగా ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, చైతన్య, అఖిల్ వారి వంశం మొత్తం ఒకే వెండితెరపై కనిపించి ప్రేక్షకుల కళ్ళు బైర్లు కమ్మేలా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా మొత్తానికి క్లైమాక్స్లో అఖిల్ ఎంట్రీ ఇవ్వడం సినిమాకి హైలెట్ గా నిలిచింది.
అయితే మరోసారి సరికొత్త కుటుంబం సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఆ ఫ్యామిలీ ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఆ కుటుంబం అందరికీ సుపరిచితులే. వారి కుటుంబంలో వారు కేవలం నటనకు  మాత్రమే పరిమితం కాకుండా దర్శకత్వం, నిర్మాతలుగా  కూడా వహించినవారు. ఆ ఫ్యామిలీ ఎవరో కాదండోయ్ దగ్గుపాటి వారి కుటుంబం.అయితే అప్పట్లో దగ్గుబాటి రామానాయుడు గారు హీరోలైనా వెంకటేష్ నాగ చైతన్య ల తో కలిపి ఒక సినిమా తీయాలని కలలు కన్నారు.  అయితే ఆ కల నెరవేరకుండానే 2015 సంవత్సరంలో దగ్గుబాటి రామానాయుడు గారు కన్నుమూశారు.
అయితే దగ్గుబాటి రామానాయుడు గారి కలలను తీర్చడానికి తన తనయుడు సురేస్ బాబు ముందుకొచ్చారు.  ప్రస్తుతం దగ్గుబాటి కుటుంబంలోని వారు వెంకటేశ్, రానా, నాగచైతన్యలు కలిపి మనం లాంటి మరో సినిమాను సృష్టించబోతున్నారు. శతమానం భవతి సినిమాకు దర్శకత్వం వహించినసతీష్ వేగేశ్న దగ్గుపాటి వారి కుటుంబం ఆధారంగా ఒక మంచి కథను రాశారట. సురేష్ బాబు గారు ఓకే చెప్పడంతో సినిమా షూటింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయని ఇంటలిజెంట్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమాకు సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించనున్నారు.అయితే మనం సినిమా ప్రజల ముందుకు వచ్చి ఎంత భారీ విజయాన్ని సాధించిందో, ఇక దగ్గుపాటి వారి కుటుంబం కూడా మన ముందుకు వచ్చి ఇలా అలరించబోతున్నారు అనే విషయం కోసం వేచి ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: