రకుల్ ప్రీత్ సింగ్ కి భారీ షాకిచ్చిన క్రిష్..పాపం ఆ స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది..??

Anilkumar
టాలీవుడ్లో వైవిధ్యమైన కథలను సినిమాలుగా తెరకెక్కించి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఇండ్రస్టీ లో కొనసాగుతున్నాడు దర్శకుడు క్రిష్.. ముఖ్యంగా పౌరాణిక చిత్రాలను తీయడంలో క్రిష్ సిద్ధ హస్తుడు.. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా తీస్తున్నాడు క్రిష్.. ఏఎమ్ రత్నం ఈ మూవీని నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం ఆ మధ్యన మూవీ యూనిట్ ఒక సెట్ కూడా వేసింది. అయితే భారీ వర్షాలకు ఆ సెట్ కూలిపోగా.. ఇప్పుడు మళ్లీ దాన్ని నిర్మించే పనిలో పడ్డారు. ఈ పనులు పూర్తయ్యాక పవన్.. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్‌గా ఎప్పటినుంచో పలువురి పేర్లు వినిపించాయి.

 ప్రగ్యా జైశ్వాల్‌, నిధి అగర్వాల్, అనుష్క ఇలా పలు భామల పేర్లు వినిపించాయి. అంతేకాదు ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్ దాదాపుగా ఫైనల్ అయినట్లు వార్తలు వచ్చాయి.కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు.అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్‌గా చేసేందుకు రకుల్ ప్రీత్ ఆసక్తిని చూపారట. క్రిష్ తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడులో శ్రీదేవి పాత్రలో మెరిసింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక ఇప్పుడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ తెరకెక్కిస్తోన్న మూవీలో రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలో పవన్ మూవీలో నటించేందుకు కూడా ఇంట్రస్ట్ చూపించిందట. అయితే కాస్టింగ్ విషయంలో ఎప్పుడూ పర్‌ఫెక్ట్‌గా ఆలోచించే క్రిష్ మాత్రం.. ఆ ఆఫర్‌కి నో చెప్పారట.

 ఈ కథకు సెట్ అయ్యే వారి క్రిష్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీలో హీరోయిన్‌గా ఎవరు ఖరారు అయితారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.కాగా మరోవైపు ఈ మూవీ ఆగిపోయినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. సాంకేతిక కారణాల వలన పవన్-క్రిష్ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడిచింది.కానీ ప్రస్తుతం అందుతున్న తాజా సమాచారం ప్రకారం వైష్ణవ్ తేజ్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక.. పవన్ ప్రాజెక్ట్ ను సెట్స్ పై తీసుకెళ్తాడాట క్రిష్.. ఇక వైష్ణవ్ తేజ్ సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు వచ్చినట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: