పెళ్లి పీటలెక్కుతున్న బాలీవుడ్ జంట..!

NAGARJUNA NAKKA
రణ్‌బీర్‌ కపూర్‌ నోటి వెంట పెళ్లి అనే మాట ఇంత వరకు రాలేదు. డిస్టనరీలో ఆయనకు నచ్చని మాట అదే కాబోలు. రణ్‌బీర్‌, అలియా రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నా.. పెళ్లి గురించి మాట్లాడలేదు. ఫస్ట్‌ టైం అలియాతో నా పెళ్లి అంటూ.. రన్‌బీర్‌ ఎనౌన్స్ చేయడం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.
రణ్‌బీర్‌, అలియా చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. మొదట్లో ఫ్రెండ్స్‌ అని చెప్పుకొచ్చిన రణ్‌బీర్‌.. ఆ తర్వాత లవరేనంటూ అంగీకరించాడు. కరోనా మహమ్మారి కారణంగా పెళ్లి వాయిదా పడిందని.. లేకపోతే ఈ పాటికే పెళ్లయిపోయేదంటూ.. ఓ ఇంటర్వ్యూలో అభిమానులకు తీపి కబురు చల్లగా చెప్పాడు రణ్‌బీర్‌.
మొత్తానికి రణ్‌బీర్‌ ఓ ఇంటివాడవుతున్నాడు. ఎప్పుడూ చూసినా లవ్వు.. డేటింగ్‌ అంటూ టైంపాస్‌ చేసేశాడు. దీపిక పదుకునేతో ఎఫైర్‌ పెళ్లి దాకా వెళ్తుందని అనుకున్నారంతా. ఇక కత్రినా కైఫ్‌ను అయితే రణ్‌బీర్‌ తన ఇంట్లో వాళ్లకు పరిచయం చేయడంతో పెళ్లి పీటలు ఎక్కడమే తరువాయి అన్నంతగా సీన్స్‌ నడిచాయి. కట్‌ చేస్తే... రణ్‌బీర్‌ కెరీర్‌లో ఇంతవరకు బ్రేకప్స్‌ గానీ.. పెళ్లి మాటలేదు. ఫస్ట్ టైం ప్రేమ పెళ్లి దాకాగా వెళ్తోంది.
పదేళ్లుగా ఎఫైర్స్‌తో గడిపేసిన రణ్‌బీర్‌కు పెళ్లి చేసుకోవాలనించింది. ఈ చాక్లెట్‌బాయ్‌ వయసు 38 ఏళ్లయితే.. అలియా ఏజ్‌ 27. ఇద్దరి మధ్య 11 ఏళ్ల గ్యాప్‌ ఉంది. ప్రేమకు వయసుతో పనేంటని నిరూపించింది ఈ జంట. మొత్తానికి 40లో పడకుండా ఓ ఇంటివాడు అవుతున్నాడు రణ్‌బీర్.
మొత్తానికి ఎట్టకేలకు రణ్ బీర్ కపూర్.. అలియా పెళ్లిపీటలెక్కబోతున్నారు. వరుస బ్రేకప్స్ తర్వాత రణ్ బీర్ ఓ ఇంటివాడైపోతున్నాడు. అలియాభట్ తో పెళ్లంటూ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పేశాడు కూడా. కరోనా వల్లే తన పెళ్లి లేటయింది అని రణ్ బీర్ కపూర్ అంటున్నారు. గతంలో దీపిక, కత్రినాతో ప్రేమాయణం నడిపిన రణ్ బీర్ బ్రేకప్ చెప్పేశాడు కూడా. ఇపుడు అలియాను పెళ్లి చేసుకోబోతున్నాడు రణ్ బీర్.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: