మళ్ళి ఒక్కటైనా మెగా ఫామిలీ ...ఫాన్స్ కి పండగే ...!?

praveen
దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముందు రోజు అర్ధరాత్రి నుంచే ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇందుకు చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. కొత్త సంవత్సరానికి ఆరు రోజుల ముందు వచ్చే ఈ పండుగ కోసం ప్రపంచంలోని క్రైస్తవులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. క్రైస్తవులు మాత్రమే కాకుండా హిందువులు కూడా ఈ పండుగను జరుపుకోవడం విశేషం.

డిసెంబ‌ర్‌లో మెగా ఫ్యామిలీ ఇంట సంబురాలు అంబ‌రాన్నంటుతున్నాయి. మొన్నటి వరకు నిహారిక పెళ్లితో హడావిడి చేసిన మెగా ప్యామిలీ ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఆ వేడుకల్నిఘనంగా  జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో మొత్తం మెగా ఫ్యామిలీ ఉంది. ఇక డిసెంబ‌ర్ 18న నిహారిక బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని కూడా గ్రాండ్‌గా నిర్వ‌హించ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ హాజ‌ర‌య్యారు. ఆ ఫొటోలు కూడా అంత‌ర్జాలంలో హ‌ల్ చ‌ల్ చేశాయి.  రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, ఆమె భర్త చైతన్య, అల్లు శిరీష్, సుష్మిత కొణిదెల, సాయి తేజ్, చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాన్ దేవ్.. ఇలా మొత్తం అల్లు ఫ్యామిలీతో పాటు, చిరంజీవి ఫ్యామిలీ ఒకదగ్గరకు వచ్చి ఈ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. ఇక ఈ ఫోటోను చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి..

మొత్తం మెగా ఫ్యామిలీ అంత ఒకే ఫ్రేమ్‌లో ఉంటూ కనులవిందు చేస్తోంది. ఈ క్రిస్మస్ పార్టీని రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన హోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.  ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క‌జిన్స్‌తో సీక్రెట్ శాంటా ఆడామ‌ని అన్నాడు. అద్భుత‌మైన ఆతిథ్యం ఇచ్చినందుకు  చరణ్ & ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు శిరీష్ .ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇక ఆ పిక్‌లో రామ్ చరణ్ ఎప్పటిలాగే కోర మీసాలతో అదరగొడుతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: