మారుతి డైరక్షన్ లో రవితేజ కాదు.. మాస్ హీరోకి ఛాన్స్..!

shami
లాస్ట్ ఇయర్ ప్రతిరోజూ పండుగే సినిమాతో హిట్ అందుకున్న మారుతి తన నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది ఇంకా నిర్ణయించలేదు. లాక్ డౌన్ లో కథలు రాసుకొన్న అని చెప్పిన మారుతి ఇంతవరకు ఒక సినిమా కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. మారుతి డైరక్షన్ లో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా సినిమా వస్తుందని అన్నారు. కాని అది కుదిరేలా లేదని తెలుస్తుంది.
రవితేజ ఎందుకో ఈ ప్రాజెక్ట్ పీద అంతగా ఇంట్రెస్ట్ చూపట్లేదని టాక్. అందుకే మారుతి మాస్ హీరో గోపీచంద్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. మాస్ అండ్ యాక్షన్ హీరోగా గోపీచంద్ కు మంచి క్రేజ్ ఉంది. అయితే ఈమధ్య అతని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఈ క్రమంలో గోపీచంద్ తన కెరియర్ మీద ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం సంపత్ నంది డైరక్షన్ లో సీటీమార్ సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమా తర్వాత్ తేజతో అలిమేలు మంగ సినిమా లైన్ లో ఉంది.
ఇదే కాకుండా ఇప్పుడు మారుతి సినిమా కూడా చేస్తున్నాడని టాక్. మారుతి డైరక్షన్ లో సినిమా పడితే మాత్రం గోపీచంద్ మళ్లీ ఫాం లోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు. మరి మారుతి, గోపీచంద్ ఇద్దరు ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి. కాంబో నిజంగానే అదిరిపోతుందని చెప్పొచ్చు. టాలీవుడ్ మినిమం గ్యారెంటీ డైరక్టర్ గా మారుతి సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: