'గబ్బర్ సింగ్' డైరెక్టర్ గురించి పూజా హెగ్డే అంతమాట అన్నదేంటబ్బా ....??

GVK Writings
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గబ్బర్ సింగ్. 2012లో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అతి పెద్ద సక్సెస్ ని అందుకని అంతకుముందు కెరీర్ పరంగా వరుసగా పరాజయాలలో ఉన్న పవన్ కళ్యాణ్ కి పెద్ద బ్రేక్ ను అందించింది. ఆ తర్వాత రామయ్యా వస్తావయ్యా సినిమాను ఎన్టీఆర్ తో చేసిన హరీష్ శంకర్ దానితో ఊహించని విధంగా పరాజయం అందుకున్నారు. ఆపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా దువ్వాడ జగన్నాథం. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎబోవ్ యావరేజ్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా ద్వారా నటిగా మంచి పేరు దక్కించుకుంది హీరోయిన్ పూజ హెగ్డే. అంతకుముందు కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేక ఎంతో సతమతమైన పూజాని ఏరికోరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారు హరీష్ శంకర్.

ఇక ఆ తర్వాత ఆయన మరొక సారి తన తదుపరి సినిమా గద్దలకొండ గణేష్ లో వరుణ్ తేజ్ సరసన పూజనే హీరోయిన్ గా హరీష్ ఎంపిక చేయడం జరిగింది. గత ఏడాది మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకని పూజా కెరియర్ కి మరింత హెల్ప్ అయిందనే చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఒకానొక ప్రముఖ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా ఆమె మాట్లాడుతూ తనను కెరీర్ మొదట్లో దర్శకుడు హరీష్ ఎంతగానో నమ్మారని, అలానే నిర్మాత దిల్ రాజు కూడా తన కెరీర్ ఎదుగుదలకు ఎంతో కారణం అని, తనపై నమ్మకం ఉంచిన ఆ ఇద్దరికీ ప్రత్యేకంగా ఆమె ధన్యవాదాలు చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక వారి పై ఆమె చేసిన కామెంట్స్ కి  పలువురు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కృతజ్ఞత అనేది ఎంతో గొప్పదని గతంలో జరిగిన మేలుని గుర్తుపెట్టుకొని మీరు చేసిన ఈ పోస్ట్ మీ యొక్క మంచితనాన్ని చెప్పకనే చెప్తోందని పలువురు పూజా అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: