హాట్ టాపిక్ గా మారిన సాయి పల్లవి మాటలు..!

NAGARJUNA NAKKA
సాయి పల్లవి ఏం మాట్లాడినా స్ట్రయిట్‌ ఫార్వర్డ్‌గా మాట్లాడుతుంది. పెర్ఫామెన్స్‌లో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటుందో, ఒపీనియన్స్‌ని అంతే ఖచ్చితంగా చెబుతుంది. లేటెస్ట్‌గా తెలుగు ఇండస్ట్రీ గురించి సాయి పల్లవి చేసిన కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్‌ గురించి హైబ్రిడ్ పిల్ల మరీ ఇంత పబ్లిక్‌గా మాట్లాడిందా అని డిస్కషన్స్‌ జరుగుతున్నాయి.
సాయి పల్లవి రీసెంట్‌గా ఇచ్చిన ఒక స్టేట్ మెంట్  సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మళయాళం, తెలుగు ఇండస్ట్రీస్‌ మధ్య డిఫరెన్సెస్‌ గురించి పల్లవి ఇచ్చిన సమాధానం హాట్‌ టాపిక్‌గా మారింది. హైబ్రిడ్‌ పిల్ల తెలుగు ఇండస్ట్రీలో భజన బ్యాచ్ ఎక్కువని చెప్పింది.. తెలుగు వాళ్ల గాలి తీసిందని పోస్టులు పెడుతున్నారు నెటిజన్ లు.
సాయి పల్లవి మళయాళం సినిమాల నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. అక్కడ 'ప్రేమమ్' హిట్‌తో డ్రీమ్‌గర్ల్‌గా మారిన సాయి పల్లవి 'ఫిదా'తో టాలీవుడ్‌కి వచ్చింది. తర్వాత తమిళ సినిమాలతోనూ బిజీ అయ్యింది. అయితే లేటెస్ట్‌గా ఒక ఇంటర్వ్యూలో సాయిపల్లవిని తెలుగు, మళయాళీ పరిశ్రమల మధ్య ఉన్న తేడా ఏంటని అడిగితే, ఇంట్రెస్టింగ్‌ ఆన్సర్‌ చెప్పింది పల్లవి.
తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్టులని ఎక్కువ పాంపర్ చేస్తారు. బాబు..పాప.. అని చుట్టూ తిరుగుతుంటారు. కానీ మళయాళీ ఇండస్ట్రీలో ఈ పాంపరింగ్‌ కనిపించదు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరిని ఒకేలా ట్రీట్‌ చేస్తారని చెప్పింది సాయి పల్లవి. దీంతో హైబ్రిడ్‌పిల్ల తెలుగునాట భజన బ్యాచ్‌ గురించి స్టేట్మెంట్స్‌ ఇచ్చింది, టాలీవుడ్ మేకర్స్‌పై సెటైర్లు ఏసిందని కామెంట్ చేస్తున్నారు జనాలు.
మొత్తానికి సాయిపల్లి కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. తెలుగులో ఆర్టిస్టులను పాంపర్ చేస్తారని చెప్పిన ఆ బ్యూటీ మాటలు ఇపుడు చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉంటే తెలుగు నాట భజన బ్యాచ్ ఎక్కువని నెటిజన్లు పోస్ట్ లు పెట్టడంతో సాయిపల్లవికి మరింత ఊతమిచ్చినట్టయింది. చూద్దాం.. ముందు ముందు ఈ నేచురల్ బ్యూటీ ఎలాంటి కామెంట్స్ చేస్తుందో.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: