బిగ్ బాస్ దివి.. దుమ్మురేపుతున్న లేటెస్ట్ పిక్..!

shami
మోడల్ కమ్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న దివి బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టంట్ గా వచ్చింది. హౌజ్ లో తన గ్లామర్ తో క్రేజ్ తెచ్చుకున్న దివి తన ముద్ర వేయడంలో కొద్దిగా వెనకపడ్డది. హౌజ్ లో అమ్మా రాజశేఖర్ తో స్నేహం.. మిగతా హౌజ్ మేట్స్ తో ఆట పాటలు దివి టాలెంట్ ఎక్స్ పోజ్ అయ్యేలా చేశాయి. బిగ్ బాస్ లోకి వెళ్లకముందు కేవలం 20 వేల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్న దివి బిగ్ బాస్ నుండి బయటకు వచ్చే సరికి 4 లక్షల మంది ఫాలోవర్స్ అయ్యారు. అంతేకాదు ప్రస్తుతం దివి ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ దాదాపు ఐదున్నర లక్షల మంది దాకా ఉన్నారని తెలుస్తుంది.
హీరోయిన్ గా ఎదగాలని చూస్తున్న దివి ఇన్ స్టాగ్రాం లో తన క్రేజీ స్టిల్స్, హాట్ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. అందులో భాగంగా లేటెస్ట్ గా ఓ క్రేజీ పిక్ ను షేర్ చేసింది దివి. పర్ఫెక్ట్ స్టార్ హీరోయిన్ కటౌట్ ఉన్న ఈ అమ్మడు లేటెస్ట్ హాట్ పిక్ తో ప్రేక్షకుల హృదయాలు కొల్లగొడుతుంది. సరైన ఛాన్స్ రావాలే కాని దివి తప్పకుండా స్టార్ గా ఎదిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.
ఆల్రెడీ ఆహాలో ఒకటి రెండు వెబ్ సీరీస్ లు చేసిన దివి బిగ్ బాస్ లో మరికొన్ని రోజులు ఉండి ఉంటే సీన్ వేరేలా ఉండేది. హౌజ్ లో అందరు ఆట ఆడితే దివి మాత్రం తన ఆట ఆడి అలరించింది. అయితే బిగ్ బాస్ వల్ల తన ఫాలోవర్స్ ను పెంచుకున్న అమ్మడు ఫోటో షూట్స్ తో వారిని ఎట్రాక్ట్ చేస్తుంది. ఏదో ఒకరోజు దివి స్టార్ ఛాన్స్ కొట్టి సత్తా చాటుతుందని చెప్పొచ్చు. తప్పకుండా దివి తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నంలో ఈ ఫోటో షూట్స్ ఆమెకు సూపర్ క్రేజ్ వచ్చేలా చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: