రూమర్స్ కు చెక్.. ముహుర్తం ఫిక్స్..!

shami
నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమా గురించి కొన్నాళ్లుగా మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఫైనల్ గా ఈ సినిమా ముహుర్తం డేట్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 10 గురువారం హైదరాబాద్ లో శ్యామ్ సింగ రాయ్ పూజా కార్యక్రమాలు జరగనౌన్నాయి. ఈ సినిమాపై వచ్చిన రూమర్స్ అన్నిటికి చెక్ పెడుతూ సినిమా స్టార్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం నాని శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగ రాయ్ సెట్స్ మీదకు వెళ్తుంది. టక్ జగదీష్ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తుండగా శ్యామ్ సింగ రాయ్ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారని తెలుస్తుంది. శ్యామ్ సింగ రాయ్ నాని కెరియర్ లో స్పెషల్ మూవీగా ఉంటుందని టాక్. అంతేకాదు సినిమాలో నాని డ్యుయల్ రోల్ చేస్తాడని అంటున్నారు.
వి సినిమా రిజల్ట్ తర్వాత నాని తన సినిమాల మీద మరింత ఫోకస్ పెట్టాడు. తప్పకుండా నాని శ్యామ్ సింగ రాయ్, టక్ జగదీష్ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయని అంటున్నారు. ఇక ఈ సినిమాల తర్వాత నాని వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికి అనే మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా కూడా క్రేజీగా ఉండబోతుందని టాక్. మరోసారి నాని వరుస సినిమాలతో ఫామ్ కొనసాగించేలా ఉన్నాడని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: