నిర్మాతగా అనిల్ సక్సెస్ అవుతాడ?

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..సాధారణంగా దర్శకులు నిర్మాతలుగా మారడం మనం చూస్తూ ఉంటాము. దర్శకదీరుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, క్రియేటివ్ డైరెక్టర్  సుకుమార్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇలా చాలా మంది దర్శకులు నిర్మాతలుగా మారారు. ఇప్పుడు ఈ కోవలోకి మరో దర్శకుడు చేరబోతున్నాడు. ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో దూసుకుపోతూ వినోదత్మక చిత్రాలకు బ్రాండ్ గా మారిన దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఓ సినిమాకి నిర్మాతగా మారాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమా తీసి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు....ఇప్పుడు ఒక సినిమా కి నిర్మాతగా మారాడు. ఆ సినిమా పేరు ‘గాలి సంపత్’. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు. సైన్ స్క్రీన్స్ అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి ఎస్.కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ముగ్గురూ అనీల్ రావిపూడికి మంచి స్నేహితులు. ఈ క్రమంలో అనీల్ కూడా ఈ ప్రాజెక్ట్ లో నిర్మాణ భాగస్వామిగా మారారు.
అలానే ఈ సినిమాని స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది.సాయి అనే రచయిత కథ అందించగా.. అనీష్ కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. సినిమాలో ‘గాలి సంపత్’ అనే పాత్రని రాజేంద్రప్రసాద్ పోషించబోతున్నారట. ఆయన పేరునే సినిమా టైటిల్ గా పెట్టారు. ఇలా సీనియర్ నటుడికి టైటిల్ రోల్ ఇవ్వడం బట్టి చూస్తుంటే ఇదేదో విభిన్న ప్రయత్నంలా అనిపిస్తోంది. ఈ కథకి అనీల్ రావిపూడి స్క్రీన్ ప్లే కూడా అందించాడట.ఇక నిర్మాతగా కూడా అనిల్ రావీపూడి బ్లాక్ బస్టర్ అందుకోవాలని కోరుకుందాం...ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: