విజయ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్.. ఇదిగో ప్రూఫ్..

Satvika
విజయ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అయితే సినిమాల కన్నా కూడా విజయ్ బయట బాగా పాపులర్ అయ్యారు..తమిళ్లో వచ్చిన ఏ సినిమా అయిన సూపర్ హిట్ అవుతాయంటున్నారు.. విజయ్ అభిమానులు.. ఇక తెలుగులో కూడా అంతే  ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో తెలుగులో కూడా విజయ్ కు మంచి మార్కెట్ ఉంది.. ఇటీవల వచ్చిన బిగెల్  సినిమా సూపర్ హిట్ అయ్యింది.. బ్లాక్ బస్టర్ హిట్ ను కూడా అందుకుంది..


ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమా లో నటిస్తున్నాడు.. ఆ సినిమానే మాస్టర్... డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రూపొందించిన `మాస్టర్` సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లాక్‌డౌన్ అడ్డురావడంతో ఈ సినిమా విడుదల నిలిచిపోయింది..ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. దీంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. సినిమా విడుదల కోసం విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..


దీపావళి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. టీజర్‌ చూస్తుంటే విజయ్‌ రెండు లుక్స్‌లో కనినిస్తున్నారు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో యూత్‌ను ఆకట్టుకునే విజయ్‌ లుక్‌ ఉంది. డైరెక్టర్‌ లోకేశ్‌, విజయ్‌ రోల్‌ను మాసీగా డిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.. భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్ తో రూపొందిస్తున్న ఈ సినిమాతో విజయ్ లైఫ్ మరో మైలు రాయిని చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. విడుదలకు సిద్దంగా ఉన్నా కూడా ఇప్పటిలో ఉన్న పరిస్థితుల కారణంగా సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: