వెబ్ సైట్లను బండబూతులు తిట్టిన డ్యాన్స్ మాస్టర్..
ప్రభుదేవా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కొన్నిరోజులుగా కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా కూడా ప్రభుదేవా పెళ్లిపై లెక్కకు మిక్కిలి వార్తలు సోషల్ మీడియాలో కనిపించాయి. కొన్ని ప్రముఖ ఫిలిం వెబ్ సైట్లు కూడా ఈ సమాచారాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. దీంతో వ్యవహారం ప్రభుదేవా వరకు వెళ్లింది. కనీసం క్రాస్ చెక్ కూడా చేసుకోకుండా ఇలాంటి వార్తల్ని ఎలా రాస్తారంటూ మండిపడ్డారు ప్రభు.
ప్రభుదేవా, అతని భార్య రామలత మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వీరిద్దరూ కొన్ని సంవత్సరాల క్రితం విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. ఆ తర్వాత ప్రభుదేవా నయనతారతో ప్రేమలో పడటం, వారిద్దరి వ్యవహారం పెళ్లి వరకు వెళ్లి విడిపోవడం అందరికీ తెలిసిందే. తాజాగా ప్రభుదేవా తన బంధువుతో ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆమె కూడా ప్రభుదేవా ప్రేమను అర్థం చేసుకుందని.. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగింది. ఇలా సాగిన ఈ ప్రచారంపై ప్రభుదేవా మండిపడ్డారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది విడుదలైన ‘దబాంగ్ 3’ చిత్రంతో దర్శకుడిగా బాలీవుడ్‌లో మరో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రభుదేవా. మళ్లీ సల్మాన్ ఖాన్ హీరోగా ‘రాధే’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇంతలోనే ప్రభుదేవా పెళ్లి వ్యవహారంతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. తన పెళ్లిపై వచ్చిన పుకార్లన్నిటీకీ ఫుల్ స్టాప్ పెట్టేశారు ప్రభుదేవా.