మరోసారి రాజీవ్ ప్రేమలో పడిన సుమ.. రూమర్స్ కు చెక్..
అయితే పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బ అంటారు కదా అలా .. సుమకు ఎన్నో రూమర్స్ ఎదురయ్యాయి. ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి.. అవన్నిటిని సుమ లైట్ తీసుకుంటూ వస్తుంది. తన పని తాను చేసుకుంటూ వస్తుంది. అందుకే సుమ గ్రేట్ అని ఆమె అభిమానులు అంటారు..కాగా ఈ మధ్య సుమ రాజీవ్ విడిపోయారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రసారమైన క్యాష్ ప్రోగ్రామ్ లో సుమ రాజీవ్ మీద ఉన్న ప్రేమను చూపించిన కూడా విమర్శలు మాత్రం ఆగడం లేదు.. దానికి తాజాగా సుమ దిమ్మతిరిగే జవాబు చెప్పింది.
భర్త రాజీవ్ కనకాల పుట్టినరోజు సందర్భంగా ఆయనతో సరదాగా గడిపిన ఫోటో షేర్ చేస్తూ నువ్వే నా బలం, నువ్వే నా సర్వస్వం.. ఐ లవ్ యూ రాజా అని పేర్కొంది. నా ప్రియమైన రాజాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వే నా బలం, సంతోషం. నా జీవితంలో నువ్వు ఓ వరం. నీ తోడుగా నడిచే ప్రతి అడుగు, ప్రతి రోజు కొత్తగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ'' అంటూ భర్తపై తన ప్రేమను వ్యక్తపరుస్తూ ట్వీట్ చేసింది సుమ. ఈ ట్వీట్ చూసిన సుమ, రాజీవ్ ఫ్యాన్ పెద్దఎత్తున రియాక్ట్ అవుతూ అతనికి సుమ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కూడా రాజీవ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.