ఆహా జక్కన్నా ..... నిజంగా మీ తెలివితేటలకి హ్యాట్సాఫ్ ....??
ఇటీవల ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి భారీ స్థాయిలో రెస్పాన్స్ ని దక్కించుకోవడంతో పాటు సినిమాపై తారాస్థాయిలో ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. లాక్ డౌన్ కి ముందు చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. నిజానికి ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దామని భావించారు అయితే మధ్యలో కరోనా కారణంగా విధించబడిన లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో దీని రిలీజ్ ని వచ్చే ఏడాది వేసవి తర్వాత ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాని పక్కాగా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని ఇటీవల అనుకున్నారట.
కానీ ఆ సమయానికి చాలా సినిమాలు రిలీజ్ అవుతుండటంతో పాటు అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం కాబట్టి మరి కొన్నాళ్ళు ఆగి మొత్తంగా కరోనా పరిస్థితి అనేది సమస్థితికి వచ్చి ప్రజలందరూ కూడా ధైర్యంగా థియేటర్స్ కి వచ్చి సినిమా చూసే పరిస్థితి ఏర్పడినప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారట. అలాచేస్తే ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రావడంతోపాటు సినిమాకి మంచి టాక్ కనుక వస్తే పక్కాగా కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలో వస్తాయని చూస్తున్నారట రాజమౌళి. ఇక ఈ విషయమై ఆహా జక్కన్న నిజంగా మీ తెలివితేటలకు హ్యాట్సాఫ్ అంటూ పలువురు ప్రేక్షకులు అభిమానులు తమ సోషల్ మీడియా ద్వారా ఆయనను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు....!!