కొంచెం లేట్ అయినా లేటెస్ట్ గా సినిమా చేస్తున్నారా..?

P.Nishanth Kumar
కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమాలు అన్నీ మొదలయి దాదాపు పూర్తి చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఇన్ని రోజులు వచ్చిన గ్యాప్ ని కవర్ చేసుకుని అన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లిపోతున్నాయి.. కానీ కొంతమంది టాలీవుడ్ హీరో లు మాత్రం కోవిడ్ ప్రభావం అంతగా లేకపోయినా కూడా షూటింగ్ చేయడానికి ఆలోచిస్తున్నారు.. ఇతర హీరో లు సినిమాలు చేసి వేరే సినిమాలకు వెళుతున్నా కూడా ఇప్పటివరకు చిరు ఆచార్య నుంచి కానీ, వెంకీ నారప్ప నుంచి కానీ ఎలాంటి అప్ డేట్ రాలేదు..దాంతో ఆయా హీరోల ఫాన్స్ కొంత ఆందోళనకు లోనవుతున్నారు..
అయితే వారికి ఉత్సాహాన్ని ఇచ్చే న్యూస్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య కూడా ఈ నెల 9 నుంచి పునఃప్రారంభం కాబోతున్నట్టు తెలిసింది. రామోజీ ఫిలిం సిటీలోనే కంటిన్యూ చేయొచ్చు.ఈరోజు నుంచి వెంకటేష్ కొద్దిరోజుల పాటు హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో జరిపే చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు.ఏడు నెలలు కళావిహీనంగా ఉన్న స్టూడియోలు క్రమక్రమంగా సందడితో నిండుతున్నాయి. దాదాపు టాలీవుడ్ యాక్టర్స్ అందరూ ఎవరి సినిమాల్లో వాళ్ళు లాక్ అయిపోయారు.
ఇక వెంకటేష్ తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ రీమేక్ గా నారప్ప ని తెరకెక్కిస్తున్నారు..  ఈ కల్ట్ విలేజ్ డ్రామాలో వెంకీ సరసన ప్రియమణి భార్యగా నటిస్తోంది. వయసు మళ్ళిన పాత్రలో వెంకీ లుక్ మీద ఇప్పటికే మంచి ఫీడ్ బ్యాక్ ఉందిబ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న నారప్ప  కి మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.ఇప్పటికే విపరీతమైన ఆలస్యం జరిగిన ఆచార్య లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈ దసరాకే వచ్చేది. ఇప్పుడు 2021 సమ్మర్ ని ఫిక్స్ చేసుకున్నారు. కొత్త పెళ్లి కూతురు కాజల్ అగర్వాల్ చిరంజీవితో జతకడుతుండగా దీనికీ మణిశర్మే సంగీతం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: