నిర్మాతలకి చుక్కలు చూపిస్తున్న పవర్ స్టార్ పారితోషికం... !

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి..పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఆ చిత్రంతో పాటుగా క్రిష్ డైరెక్షన్లో కూడా ఒక సినిమా మొదలుపెట్టాడు. నిజానికి ‘వకీల్ సాబ్’ పూర్తయిన వెంటనే క్రిష్ ప్రాజెక్టునే కంప్లీట్ చెయ్యాల్సి ఉంది. కానీ కరోనా లాక్ డౌన్ వల్ల ప్లానింగ్ మొత్తం మారిపోయింది.ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ పూర్తయిన వెంటనే మలయాళం సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ లో నటించడానికి పవన్ రెడీ అవుతున్నాడు.‘అప్పట్లో ఒకడుండే వాడు’ ఫేమ్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. నిజానికి ఇంత సడన్ గా పవన్ ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చెయ్యడానికి గల కారణం ఏంటి? అని అంతా అనుకున్నారు. 

పవన్ వెంటనే ఈ ప్రాజెక్టు చెయ్యడానికి ఓకే చెప్పింది రెండు కారణాలతో అని తెలుస్తుంది. మొదటి కారణం..ఈ సినిమా 3నెలల్లో పూర్తయిపోతుంది. అందుకు పవన్ కళ్యాణ్ 40 రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుందట. మరో కారణం..ఈ చిత్రానికి పవన్ అందుకోబోయే పారితోషికం అని తెలుస్తుంది. ఆ 40 రోజులకు గాను పవన్ కు 30 కోట్ల పారితోషికం ఆఫర్ చేశారట ‘సితార ఎంటర్టైన్మెంట్స్’వారు.


అది కాకుండా సినిమాకి వచ్చే  లాభాల్లో 20శాతం వాటా కూడా ఉండబోతుందని సమాచారం.అందుకే వెంటనే ఈ ప్రాజెక్టు చెయ్యడానికి పవన్ ఓకే చెప్పేశాడని తెలుస్తుంది. ఇక జనవరి నుండీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని ఇన్సైడ్ టాక్.ఇలాంటి మరిన్ని మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: